/rtv/media/media_files/2025/02/09/N29MH7Y3ssaXaLEtXnEv.jpg)
gold
బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత రెండు రోజులుగా తగ్గుతూ వస్తున్న ధరలు ఈరోజు ఒక్కసారిగా పెరిగి షాకిచ్చాయి. దీంతో ఈ వారంలో సుమారు రూ.700 నుండి రూ.800 వరకు తగ్గిన ధరలు చివరి రోజున శనివారం రూ.400 నుండి రూ.550 పెరిగాయి. జనవరి 22న బంగారం ధర మొదటిసారిగా రికార్డు ధర అయిన రూ.80,000ను దాటి కొత్త రికార్డును చేరుకుంది.అయితే పెళ్లిళ్ల సీజన్ సమయంలో బంగారం కొనుగోళ్లు జోరుగా ఉంటాయి.
Also Read: Kannada Actress Ranya Rao: రన్యా రావు ఒంటి పై గాయాలు..అసలేమైంది!
మరోవైపు ధరల ట్రెండ్ ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో బంగారం ధరలు వెండి లాగానే లక్షకు చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంటున్నారు. బంగారం, వెండి ధరలు పెరగడానికి, తగ్గడానికి అంతర్జాతీయ మార్కెట్లలోని కదలికలు, స్టాక్ మార్కెట్లో మార్పులు దీనికి కారణం. అంతేకాకుండా అమెరికా డాలర్ బలపడటం, బాండ్ దిగుబడి తగ్గడం బంగారం ధరలను ప్రభావితం చేశాయి. అమెరికాలో ట్రంప్ ప్రమాణ స్వీకారం తర్వాత ఆర్థిక మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై ఆకర్షణను పెంచింది.
Also Read: Telangana Crime: కుటుంబ కలహాలతో తల్లిని నరికి చంపిన కొడుకు
ప్రస్తుతం గ్రాము బంగారం ధర 1 గ్రాము 22 క్యారెట్లు రూ.8,040 , 1 గ్రాము 24 క్యారెట్లు రూ. 8,771, 1 గ్రాము 18 క్యారెట్లు రూ. 6,578. 10 గ్రాములు 22 క్యారెట్ల ధర రూ. 80,400, నిన్నటి ధర రూ.79,900 అంటే రూ.500 పెరిగింది. 10 గ్రాములు 24 క్యారెట్ల ధర రూ. 87,710, నిన్నటి ధర చూస్తే రూ.87,160 దింతో రూ.550 పెరిగింది. 10 గ్రాములు 18 క్యారెట్ల ధర రూ. 65,780, నిన్నటి ధర రూ.65,380 సుమారు రూ.400 పెరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. విజయవాడలో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, అమరావతిలో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, గుంటూరులో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, నెల్లూరులో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, కాకినాడలో 22 క్యారెట్ల ధర రూ.80,400, 24 క్యారెట్లకు రూ.87,710, 18 క్యారెట్లకు రూ.65,780, ఇక వెండి ధర చూస్తే 10 గ్రాములకి రూ.10,810, కేజీ ధర రూ.1,08,100.
Also Read: Trump-Musk-Rubio: ట్రంప్ క్యాబినెట్ మీటింగ్ లో గొడవ పడ్డ మస్క్..రూబియె
Also Read:Air India: వీల్‌ఛైర్ లేదన్న ఎయిరిండియా.. ఐసీయూలో వృద్ధురాలు