/rtv/media/media_files/2025/02/24/hLKeRE5UAPjZXMXFeKh0.jpg)
BSNL new recharge Photograph: (BSNL new recharge)
BSNL Bumper Offer: ప్రైవేట్ టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచినప్పటి నుండి మొబైల్ యూజర్లు BSNL వైపు చూస్తున్నారు. దీనికితోడుగా BSNL ప్రకటిస్తున్న రిఛార్జ్ ప్లాన్స్ వేరే నెట్‌వర్క్ యూజర్లు కూడా బీఎస్ఎన్ఎల్‌కు మళ్లే విధంగా చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ వరుస ఆఫర్లతో వినియోగదారులకు దగ్గరవుతుంది. గత ఆరేడు నెలలుగా BSNL కంపెనీ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్లు ప్రకటించి మొబైల్ యూజర్లను ఆకర్శిస్తోంది.
Also Read: Tamilanadu: నటి పై రాజకీయ నేత అత్యాచారం.. ఏడుసార్లు అబార్షన్..కోర్టు సంచలన తీర్పు!
తాజాగా మరో మూడు అదిరిపోయే లాంగ్ స్టాండింగ్ ప్లాన్లను ఆ కంపెనీ రిలీస్ చేసింది. ఇప్పటికే చాలామంది ఇతర ప్రైవేట్ నెట్‌వర్క్ కస్టమర్లు BSNLకు మళ్లారు. ఈ దెబ్బతో ఎయిర్ టెల్, జియో కంపెనీలు మూసుకోవాల్సిందే అంటున్నారు టెలికాం రంగంలో నిపుణులు. భారత్ సంచార్ నిఘామ్ లిమిటెడ్ కంపెనీ వ్యవహరిస్తున్న తీరు ఎయిర్ టెల్, Vi, జియో లాంటి టెలికాం దిగ్గజ సంస్థలకు సవాల్‌గా మారింది. తక్కువ ధరలకే రిఛార్జ్ ప్లాన్స్ అందిస్తోండటంతో మెబైల్ యూజర్లు బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌కు మొగ్గుచూపుతున్నారు.
Also Read: నేడు AP బడ్జెట్ సమావేశాలు ప్రారంభం.. అసెంబ్లీకి జగన్..?
మూడు కొత్త రీఛార్జ్ ప్లాన్స్
150 రోజుల ప్లాన్
BSNL యూజర్లు రూ.397తో రీఛార్జ్ చేస్తే.. ఐదు నెలల దాకా తరచుగా రీఛార్జ్ చేసుకునే పని ఉండదు. ఈ ప్లాన్‌లో 150 రోజుల ఇన్‌కమింగ్ కాల్స్ వర్తిస్తాయి. మొదటి 30 రోజులు అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ 2GB డేటాను ఎంజాయ్ చేయోచ్చు. ప్రతిరోజూ 100 ఉచిత SMSలను పొందుతారు. ఇన్ కమ్మింగ్ కాల్స్ మాత్రమే వస్తే చాలు అనుకునే వారికి ఇది అనువైన ప్లాన్.
160 రోజుల ప్లాన్
ఇందులో రూ.997తో రీఛార్జ్ చేస్తే.. 160 రోజులపాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. అదనంగా, ప్రతిరోజూ 2GB డేటాను పొందుతారు. తక్కువ ధరకు అన్‌లిమిటెడ్ కాల్స్, డైలీ డేటా ప్యాకేజ్ కావాలనుకునేవారికి ఇది బెస్ట్ ప్యాక్.
180 రోజుల ప్లాన్
మరో దీర్ఘకాలిక రీఛార్జ్ ప్లాన్ రూ. 897 చెల్లించి.. 180 రోజుల వరకు ఈ ప్లాన్ వర్తిస్తోంది. అన్ని నెట్‌వర్క్‌లలో అపరిమిత ఉచిత కాలింగ్‌ను అందిస్తుంది. అదనంగా, చందాదారులు రోజుకు మొత్తం 90GB డేటా, 100 ఉచిత SMSల బెనిఫిట్స్ పొందుతారు.