ఆర్బీఐ ఎఫెక్ట్.. ఈ కంపెనీల షేర్లు భారీగా పతనం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల ప్రభావం గోల్డ్ లోన్ కంపెనీలపై భారీగా పడింది. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్ల ప్రభావం గోల్డ్ లోన్ కంపెనీలపై భారీగా పడింది. ఆర్బీఐ ప్రకటించిన వెంటనే ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ లిమిటెడ్ షేర్లు దాదాపుగా 10 శాతం వరకు పడిపోయాయి.
ఆర్బీఐ మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. రెపో రేటును 0.25 శాతం వరకు తగ్గిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. 6.25శాతానికి ఉన్న రెపో రేటు 6 శాతానికి తగ్గింంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే.
నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ చైైనాపై 104% టారిఫ్‌లు పెంచడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 దగ్గర కొనసాగుతోంది.
ట్రంప్ టారీఫ్ ల దెబ్బతో కుదేలైపోయిన స్టాక్ మార్కెట్ ఈరోజు కాస్త కోలుకుంది. ఉదయం మార్కెట్ ప్రారంభ సమయం నుంచే లాభాల బాటలో పయనిస్తోంది. సెన్సెక్స్ 1100 పాయింట్లు, నిఫ్టీ 400 పాయింట్లు పెరిగి 22,550 స్థాయిలో ట్రేడవుతున్నాయి.
టారీఫ్‌ల విధింపులో ట్రంప్ వెనక్కి తగ్గే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికా 180 దేశాలపై ఏప్రిల్ 2 నుంచి దిగుమతి సుంకాలు విధించింది. అమెరికన్స్‌తోపాటు, విదేశాల్లో ట్రంప్ చర్యపై వ్యతిరేకత రావడంతో 90రోజులు కొన్నిదేశాలపై సుంకాలు నిలిపివేసే అవకాశం ఉంది.
సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపింది. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెంచింది. LPG సిలిండర్‌పై రూ.50 పెంచినట్లు ప్రకటించింది. పెరిగిన ధరలు రేపటినుంచి అమల్లోకి రానున్నాయి. ఇప్పటికే పెట్రల్, డీజిల్ పై రూ.2 పెంచిన విషయం తెలిసిందే.