/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/domestic-cylinder-jpg.webp)
Central government increase LPG cylinders price
Gas Price Hike:
సామాన్య ప్రజలపై కేంద్ర ప్రభుత్వం మరింత భారం మోపింది. దేశవ్యాప్తంగా వంట గ్యాస్ ధరలు పెంచింది. LPG సిలిండర్‌పై రూ.50 పెంచినట్లు ప్రకటించింది. ఇప్పటికే పెట్రల్, డీజిల్ పై రూ.2 పెంచిన ప్రభుత్వం గ్యాస్ ధరలు కూడా పెంచడంతో పేదలు ఆందోళన చెందుతున్నారు.ప్రస్తుతం 14 కిలోల గ్యాస్ ధర హైదారాబాద్ లో రూ. 855గా ఉంది. వరంగల్ రూ. 874,,విశాఖపట్నం రూ. 811, విజయవాడ రూ. 827, గుంటూరు రూ. 827 గా ఉన్నాయి. అయితే పెరిగిన ధరలతో హైదరాబాద్ లో 905 రూపాయలు కానుంది.
Also Read: వారానికి ఎన్ని రోజులు ఆకుకూరలు తింటే మంచిది
#NewsFlash | #Crude inventory we are carrying is at the average of $75/bbl, can expect retail price cut if crude holds around current levels.#LPG price will be increased by ₹50/cylinder tomorrow morning, LPG under-recovery of oil marketing cos in FY25 at ₹41,338 cr. Hike in… pic.twitter.com/2rKTbCZ7n4
— CNBC-TV18 (@CNBCTV18Live) April 7, 2025
ఇదిలా ఉంటే.. వాహనదారులకు సైతం కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పెట్రోలో, డీజిల్ పై మరో రూ.2 పెంచింది. ఏప్రిల్ 7 అర్థరాత్రి నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నట్లు తెలిపింది. పెంచిన ధరలు కంపెనీలే భరిస్తాయని, సామాన్యుడిమీద భారం పడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రస్తుతం హైదరాబాద్ లో 107.46 పైసలు ఉన్న పెట్రోలో పెంచిన ధరతో 107.46 పైసలు కానుంది. ఇక డీజిల్ ప్రస్తుతం 97.70 పైసలుండగా పెరిగిన ధరతో 99.70 పైసలు కానుంది. ఇక తెలంగాణలోని వివిధ జిల్లాల్లో 108, 107 రూపాయలు కొనసాగుతోంది. అయితే ఈ పెరిగిన ధరలతో సామాన్యుడిపై ఎలాంటి భారం పడదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఇతర వస్తువులు కూడా పెరిగే అవకాశం ఉందని బిజినెస్ నిపుణులు చెబుతున్నారు.
Central Government raises excise duty by Rs 2 each on petrol and diesel: Department of Revenue notification pic.twitter.com/WjOiv1E9ch
— ANI (@ANI) April 7, 2025
Also Read: Gachibowli land dispute : కేటీఆర్, కిషన్‌రెడ్డిలకు బిగ్ షాక్.. త్వరలో విచారణకు!
Also Read: వారానికి 150 నిమిషాలు.. ఇలా చేయండి.. మీ మెదడు కత్తిలా షార్ప్!
rates | telugu-news | today telugu news