🔴Live Breakings: తెలంగాణలో జపాన్ పెట్టుబడులు.. రూ.12,062 కోట్లు
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
ఐదు రోజుల లాభాల పరుగులు కాస్త నెమ్మదించాయి. ఈరోజు స్టాక్ మార్కెట్లు అంత ఉత్సాహంగా కనిపించడం లేదు. సెన్సెక్స్ 250 పాయింట్లు పెరిగి 10 పాయింట్లు తగ్గి 79,650 స్థాయిలో ట్రేడవుతోంది. నిఫ్టీ కూడా 50 పాయింట్లకు పైగా పెరిగి 24,200 స్థాయిలో ఉంది.
నటుడు మహేష్ బాబుకు ఈడీ బిగ్ షాక్ ఇచ్చింది. సురానా, సాయిసూర్య డెవలపర్స్ కేసులో ఏప్రిల్ 27న విచారణకు హాజరుకావాలంటూ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రెండు కంపెనీల నుంచి యాడ్స్ చేసేందుకు మహేష్ రూ.3.4 కోట్లు తీసుకున్నట్లు ఈడీ గుర్తించింది.
బంగారం ధరకు రెక్కలొచ్చాయి. తాజాగా 10 గ్రాముల మేలిమి పసిడి ధర ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. దేశంలో బంగారం ధర ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే మొదటిసారి. అమెరికా, చైనా మధ్య ట్రేడ్ వార్ జరగడం, డాలర్ బలహీనపడటం వంటి కారణాల వల్ల మదుపర్లు బంగారం వైపు మొగ్గుచూపుతున్నారు.
నేడు దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి షేర్లలో నిఫ్టీ ఆల్‌టైం గరిష్ఠానికి చేరింది. స్టాక్ మార్కెట్లు ప్రారంభంలోనే సెన్సెక్స్ 350 పాయింట్లు, నిఫ్టీ 23,900తో ట్రేడ్ అయ్యింది.
జపాన్‌తో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంటోంది. హైదరాబాద్‌లో ఎకోటౌన్ ఏర్పాటుకు ఈఎక్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పీ9 ఎల్ఎల్సీ, నిప్పాన్ స్టీల్ ఇంజినీరింగ్, న్యూ కెమికల్ ట్రేడింగ్, అమితా హోల్డింగ్స్ సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి.
ఇండియాలోని ఉద్యోగులకు గూగుల్ బిగ్‌షాక్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఇండియాలో భారీగా ఉద్యోగుల తొలగింపుకు గూగుల్ సిద్ధమవుంది. బెంగళూరు, హైదరాబాద్ ఆఫీసుల్లోని ఉద్యోగుల తొలగింపునకు రెడీ అవుతోంది.
OpenAI కొత్తగా విడుదల చేసిన o3, o4-mini మోడల్స్ లోతైన ఆలోచనలతో స్పందించగలవు. o3 టెక్నికల్ గా ప్రతిభ కనబరుస్తే, o4-mini వేగం, సమర్ధవంతంగా పని చేస్తుంది. ఉచిత యూజర్లు చాట్ కంపోజర్లో ‘Think’ ఆప్షన్‌ను ఎంచుకోవడం ద్వారా o4-mini మోడల్‌ను ఉపయోగించవచ్చు.