🔴Live Breakings: న్యూస్ అప్డేట్స్
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

యూపీఐ పేమెంట్స్ చెల్లించే వారిపై జీఎస్టీ వసూలు చేయనుంది. రూ.2వేలకు పైబడి చెల్లింపులు చేస్తే 18శాతం ట్యాక్స్ వసూలు చేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. ఇదే జరిగితే సామాన్య ప్రజల నుంచి చిరువ్యాపారుల దాకా అందరిపై భారం పడుతుంది. యూపీఐ పేమెంట్స్ తగ్గిపోతాయి.
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పింది. 2026 ఆర్థిక సంవత్సరంలో (FY26) 20,000 మందికి పైగా ఫ్రెషర్లను నియమించుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జయేష్ వెల్లడించారు.
స్పేస్ ఎక్స్, టెస్లా సీఈవో ఎలన్ మస్క్‌కు ప్రధాని శుక్రవారం ఫోన్ చేసి మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయన ఎక్స్ పోస్ట్ చేశారు. టెస్లా ఇండియాలో పెట్టుబడులు పెడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనతో మోదీ ఫోన్ సంభాషణ ఆకర్షణగా నిలిచింది.
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం మత్తెక్కించే వార్త చెప్పనుంది. ఫ్రూట్ జ్యూస్ తరహాలో మద్యం అమ్మకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. రూ.50 లిక్కర్ టెట్రా ప్యాక్ అందించనుండగా 60, 90, 180 ఎంఎల్ ప్యాకెట్లు లభించనున్నాయి. కర్ణాటక తరహాలో ప్రయోగం చేయనున్నారు.
ఇండిగో సంస్థ సమ్మర్ స్పెషల్ సేల్‌లో భాగంగా రూ.1499లకే ఫ్లైట్ టికెట్‌ను అందిస్తోంది. మీరు కడప, హైదరాబాద్, కర్నూలు, చెన్నైల మధ్య ఈ ధరకే ప్రయాణించవచ్చు. అదే దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలు అయితే రూ.4999లకే టికెట్లు బుక్ చేసుకోవడానికి ఈ సేల్ ఎండ్ అవుతోంది.
ఎండలకు అల్లాడిపోతున్న జనాలకు మోదీ ప్రభుత్వం చల్లటి కబురు చెప్పింది. 'పీఎం మోదీ ఏసీ యోజన' స్కీమ్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్కీమ్ కింద పాత ఏసీలను ఇచ్చి డిస్కౌంట్‌పై తక్కువ కరెంట్‌తో నడిచే కొత్త ఏసీలను కొనుగోలు చేయొచ్చు.
బెంగళూర్‌కు చెందిన ఓ శునక ప్రియుడికి ED బిగ్ షాక్ ఇచ్చింది. ‘కడబాంబ్ ఒకామి’ పేరుగల ‘వూల్ఫ్ డాగ్’ జాతి కుక్కను రూ.50 కోట్లకు కొన్నానంటూ సతీశ్ ప్రచారం చేశాడు. దీంతో ఖరీదైన డాగ్ ఆధారాలు చూపించాలంటూ ఈడీ నోటీసులూ జారీ చేసింది.