MLC Kavita: ఈడీ కోర్టుకు వెళ్ళకూడదని నిర్ణయం తీసుకున్న కవిత ఢిల్లీ మద్యం స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణకు హాజరు కావాలంటూ ఈడీ నోటీసులు పంపించింది. దాని ప్రకారం ఆమె ఈరోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ విషయం తేలేవరకూ ఈడీ విచారణకు హాజరు కాకూడదని కవిత నిర్ణయించుకున్నారు. By Manogna alamuru 15 Sep 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈసారి కూడా ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరు కావడం లేదు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆమె హస్తం ఉందన్న ఆరోపణలతో ఈడీ విచారణకు నోటీసులు పంపింది. ఈ నేపథ్యంలో కవిత ఈ రోజు ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే దానికి హాజరుకాకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. లీగల్ నోటీసుల మీద న్యాయ విచారణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సుప్రీంకోర్టులో తాను వేసిన పిటిషన్ ను కొట్టేస్తే అప్పుడు ఈడీ విచారణకు వెళ్ళాలని కవిత డిసైడ్ చేసుకున్నారని తెలుస్తోంది. కవితకు బదులుగా ఆమె లాయర్లు ఢిల్లీ వెళ్ళనున్నారు. మొదటి నుంచీ ఢిల్లీ లిక్కర్ కేసు రాజకీయ కుట్ర అని అంటున్నారు కవిత. ఇంతకు ముందు ఈడీ పంపిన నోటీసుల గురించి కూడా కవిత స్పందించారు. మోదీ నోటీసులు అందాయని వ్యాఖ్యానించారు. ఇవన్నీ రాజకీయ పార్టీ నుంచి వస్తున్నాయి కాబట్టి పట్టించుకోవక్కరల్లేదని ఆమె కొట్టిపారేశారు. ఈడీ నోటీసులను తమ పార్టీ లీగల్ సెల్ పరిశీలిస్తోందని...వారు ఏం చెబితే అది చేస్తానని అంటున్నారు. మరోవైపు పొటికల్ ఇన్ఫ్లూయెన్స్ వల్లనే తనకు నోటీసులు వస్తున్నాయని, అందుకే తెలంగాణ ప్రజలు కూడా దానిని సీరియస్ గా తీసుకోవడం లేదని చెబుతున్నారు. కేసు విచారణ ఎంత కాలం కొనసాగుతుందో కూడా తెలియదని కవిత అన్నారు. అయితే లిక్కర్ స్కాం లో ఇప్పటికే కవిత పలుసార్లు విచారణ హాజరు అయ్యారు. ఇప్పుడు మళ్ళీ నోటీసులు రావడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత వేసిన పిటిషన్ మీద విచారణ ఇంకా కొనసాగుతోంది. అందుకే సుప్రీంకోర్టు నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చేవరకూ విచారణకు వెళ్ళనని కవిత డైరెక్ట్ గా చెబుతున్నారు. దీంతో అందరి దృష్టి ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు మీదకు మళ్ళింది. #brs #telangana #ed #kavitha #mlc #supreme-court #petition #investigation మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి