/rtv/media/media_files/2025/03/19/19gA2ZJyw2SQdJleXJdS.jpg)
YSRCP MLC Marri Rajasekhar has resigned
AP News: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న రాజశేఖర్.. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. 2014లో రాజశేఖర్ కు చిలకలూరిపేట టికెట్ ఇవ్వగా పత్తిపాటి పుల్లారావుపై ఓటమిపాలయ్యారు.
Also Read : ఇదిరా మహేశ్ బాబు రేంజ్.. ఏకంగా 1500 సార్లు టీవీలో టేలికాస్ట్ అయిన ఈ సూపర్ మూవీ ఏంటో తెలుసా?
2019 ఎన్నికల్లో మొండిచేయి..
ఈ మేరకు పార్టీని వీడబోతున్నరంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొద్దిరోజుల కిందట ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ నేతలతో జగన్ సమావేశం నిర్వహించగా ఆ సమావేశానికి మర్రి రాజశేఖర్ హాజరుకాలేదు. దీంతో ఆయన రాజీనామా చేస్తారని వార్తలకు బలం చేకూరింది. ఇప్పటికే వైసీపీకి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. ఇక 2019 ఎన్నికల్లో ఆయనకు సీటు ఇవ్వకుండా.. చిలకలూరిపేట టికెట్ ను విడుదల రజని కి కేటాయించారు. దీంతో అసంతృప్తిగా ఉన్న ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే సమయం వచ్చినప్పుడు ఆ పదవిని కట్టబెట్టారు.
Also Read: Election Commission: ఓటర్ ఐడీతో ఆధార్ కార్డు లింక్.. కీలక ప్రకటన చేసిన ఎలక్షన్ కమిషన్!
విడుదల రజినికి ఈ మధ్యకాలంలో చిలకలూరిపేట వైసీపీ ఇన్చార్జి బాధ్యతలు అప్పచెప్పారు. తన సొంత నియోజకవర్గంలో మళ్లీ రజిని తీసుకురావడంపై రాజశేఖర్ తీవ్ర అసంతృప్తి చెందినట్లు సమాచారం. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. రాజశేఖర్ టీడీపీలో చేరతారని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ నేతలతో కొంతకాలంగా ఆయన టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : Nara Lokesh: ప్రభుత్వం కనబడకూడదు, పాలన మాత్రమే కనబడాలి. మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు