YS Viveka: ఆ ఆరుగురు ఎలా చనిపోయారు.. వివేక హత్య కేసులో అంతుచిక్కని విషయాలివే!

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు విచారణ తుది దశకు చేరుకుంటున్న సమయంలో సాక్షులు అనూహ్యంగా మరణించడం సంచలనంగా మారింది. ఇప్పటికే ఐదుగురు చనిపోగా తాజాగా వాచ్ మెన్ రంగన్న మృతి రాష్ట్ర రాజకీయాలను మరోసారి కుదిపేస్తోంది.

New Update
viveka murder

YS Vivekananda Reddy murder case Sensational facts

YS Viveka:  వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు కీలక మలుపులు తిరుగుతోంది. కేసు విచారణ తుది దశకు చేరుకుంటున్న సమయంలో సాక్షులు, కేసుతో సంబంధమున్న వ్యక్తులు అనూహ్యంగా మరణించడం సంచలనంగా మారింది. 2019-24 మధ్య నలుగురు చనిపోగా ఇటీవలే మరో ఇద్దరు మృతిచెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వీరందరినీ అసహజ మరణాలేననే వాదనలు వినిపిస్తుండగా వీరి చావుల వెనక కుట్ర ఉందని చంద్రబాబు సర్కార్ భావిస్తోంది. ఇందుకు వివేకానందరెడ్డి వాచ్‌మన్‌, ప్రత్యక్ష సాక్షి రంగన్న మృతి బలమైన కారణంగా కనిపిస్తోంది. రంగన్నకు అందించిన చికిత్సపై తమకు అనుమానాలున్నాయంటూ కొడుకు కాంతారావు పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని చంద్రబాబు అధికారులను ఆదేశించినట్లు సమాచారం. 

ఎవరికైనా చెబితే నరికి చంపుతాం.. 


వాచ్‌మన్‌ బి.రంగన్న (65) వివేకా హత్యకేసులో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు. అయితే ఈయన 2025 మార్చి 5న కడప రిమ్స్‌ ఆస్పత్రిలో అనుమానాస్పదంగా మరణించడం రాష్ట్ర రాజకీయాలను మరోసారి కుదిపేస్తోంది. వివేకా ఇంటివద్ద వాచ్‌మన్‌ గా పనిచేసిన రంగన్న వివేకను చంపిన వారిని ప్రత్యక్షంగా చూశారు. ఎర్ర గంగిరెడ్డి, షేక్‌ దస్తగిరి, సునీల్‌ యాదవ్, ఉమాశంకరరెడ్డి ప్రధాన నిందితులని సీబీఐ, మేజిస్ట్రేట్‌కు వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాదు ఈ మర్డర్ గురించి ఎవరికైనా చెబితే నరికి చంపుతామని తనను ఎర్ర గంగిరెడ్డి బెదిరించినట్లు రంగన్న పోలీసులకు వివరించారు. దీంతో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకరరెడ్డితోపాటు పలువురి ప్రమేయం ఉన్నట్లు బయటపడింది. 

రంగన్న చికిత్సపై అనుమానాలు..

ఇక తన తండ్రికి గతేడాది కాలికి గాయమైతే హైదరాబాద్‌లో చికిత్స చేయించామని రంగన్న కొడుకు కాంతారావు చెబుతున్నాడు. ఆ తర్వాత కూడా రంగన్న తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడని, చికిత్సకు సంబంధించిన వివరాలు అడిగినా పోలీసులు ఇవ్వలేదని చెప్పాడు. దీంతో చికిత్సపై తమకు అనుమానాలున్నాయని రంగన్న భార్య కన్నీరుపెట్టుకుంటున్నారు. వారి ఆరోపణలు మేరకు ఇది అనుమానాస్పద మరణమేనని భావిస్తూ పోలీసులు తాజాగా దర్యాప్తు మొదలుపెట్టారు. 

జగన్‌ డ్రైవర్ నారాయణయాదవ్‌.. 
జగన్‌ డ్రైవర్ నారాయణయాదవ్‌ (52) 2019 డిసెంబరు 6 చనిపోయారు. వివేకానందరెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్‌, ఆయన సతీమణి భారతిని హైదరాబాద్‌ నుంచి పులివెందులకు తీసుకొచ్చారు. పోలీసులు సిట్‌ విచారణ జరుపుతుండగా  నారాయణ అనారోగ్యంతో మృతిచెందడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. హైదరాబాద్‌- పులివెందుల ప్రయాణంలో జగన్‌, భారతి, అవినాష్‌రెడ్డితోపాటు ఇతరులకు వివేకా మర్డర్ కు సంంధించిన ఫోన్‌ సంభాషణలు జరిగాయి. అవన్నీ విన్నాడనే నెపంతో అతన్ని అనుమానం రాకుండా చంపేశారంటూ పోలీసులు పలు ఫిర్యాదులు అందాయి. అయినా పోలీసులు అతని మరణంపై ఎలాంటి కేసు పెట్టకపోగా అంత్యక్రియలకు జగన్, భారతి హాజరై నివాళి అర్పించారు.  

Also Read :  ఎలన్ మస్క్‌ను రంగంలోకి దింపిన ట్రంప్.. సునీతా విలియమ్స్‌ తీసుకొచ్చే డేట్ ఫిక్స్!

అనుమానితుడు శ్రీనివాసులరెడ్డి..
వివేకా హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వైఎస్సార్‌ జిల్లా సింహాద్రిపురం మండలం కసనూరుకు చెందిన  కటికరెడ్డి శ్రీనివాసులరెడ్డి (57) 2019 సెప్టెంబర్‌ 3న చనిపోయాడు. విషపుగుళికలు తిని సూసైడ్ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే వివేకా హత్య కుట్ర వివరాలు అతనితోపాటు తన బావ పరమేశ్వరరెడ్డికి ముందే తెలుసనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర పోలీసులు కీలక వ్యక్తుల్ని విచారిస్తున్న సమయంలో పరమేశ్వరరెడ్డి నార్కోఎనాలసిస్‌ పరీక్షలకు హాజరైన కొద్దిరోజుల్లోనే శ్రీనివాసులరెడ్డి మృతి చెందారు. ఇక తన చావుకు సిట్‌లోని ఇన్‌స్పెక్టర్‌ కారణమంటూ అప్పటి సీఎం జగన్, కడప ఎంపీ అవినాష్‌రెడ్డిలకు రాసిన రెండు లేఖలన కుటుంబసభ్యుల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సిట్‌ ఇన్‌స్పెక్టర్‌  విచారణను అడ్డుకునేందుకు ఈ లేఖలు రాశారని, అయితే అవి శ్రీనివాసులరెడ్డి రాసినవికాదని విచారణలో పోలీసులు గుర్తించారు. 

వైఎస్‌ భారతి తండ్రి..
వైఎస్‌ భారతి తండ్రి ఈసీ గంగిరెడ్డి (73) 2020 అక్టోబరు 3న అనారోగ్యంతో చనిపోయారు. అయితే వివేకా మృతదేహానికి కట్లు కట్టింది గంగిరెడ్డి ఆసుపత్రి సిబ్బందే. కాగా వివేకా కేసు గురించి ఆయనకు బాగా తెలుసు అనే వాదనలున్నాయి. మర్డర్ కేసును కప్పిపుచ్చేందుకే ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రి సిబ్బంది ఏదో చేశారనే ఆరోపణలున్నాయి. వివేకా హత్య జరిగిన రోజు గంగిరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చేతులు పదే పదే శుభ్రం చేసుకున్నారనే పలువురు ఆరోపించారు. 

ప్రధాన సాక్షి గంగాధర్ రెడ్డి..
వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్‌రెడ్డి (40) 2022 జూన్‌ 9న కన్నుమూశారు. జగన్‌ క్యాంపు కార్యాలయంలో సీబీఐ సోదాలు నిర్వహించిన వారంరోజుల్లోనే గంగాధర్ అనారోగ్యంతో చనిపోయారు. దీంతో ఈ మరణంపై అనేక ఆరోపణలు వచ్చాయి. పులివెందులలోని జగన్‌ క్యాంపు కార్యాలయం, వివేకానందరెడ్డి, వైఎస్‌ అవినాష్‌రెడ్డి ఇళ్లు, గంగిరెడ్డి ఆసుపత్రిలో సీబీఐ బృందాలు పలు ఆధారలు సేకరించాయి. దీంతో వివేక కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్‌ అనూహ్యంగా మృతిచెందడంపై ఆనుమానాలు వ్యక్తమయ్యాయి. అంతేకాదు కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డితో కలిసి వివేకను మర్డర్ చేయించాం. ఆ నేరం తనపై ఒప్పుకుంటే రూ.10 కోట్లు ఇస్తారు. నీ లైఫ్ సెటిల్‌ చేస్తామని నిందితుడు దేవిరెడ్డి శివశంకరరెడ్డి తనకు ఆఫర్‌ ఇచ్చారని 2021 అక్టోబరు 2న గంగాధర్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇవ్వడం కలకలం రేపింది. కానీ ఆ తర్వాత గంగాధర్ శివశంకరరెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వాలంటూ సీబీఐ తనను బలవంతం చేసిందని మాట మార్చాడు. 

Also read :  సికింద్రాబాద్‌లో సైకో యువతి.. లవర్ కోసం తల్లి, అక్కను అతి దారుణంగా చంపి..!

కీలక సాక్షి వైఎస్‌ అభిషేక్‌రెడ్డి.. 
వివేకా హత్య కేసు కీలక సాక్షుల్లో ఒకరైన డా.వైఎస్‌ అభిషేక్‌రెడ్డి (36) 2025 జనవరి 10న చనిపోయారు. వైద్యుడైన అభిషేక్‌రెడ్డి వివేకా హత్యకేసు వాంగ్మూలం వెలుగులోకి వచ్చిన తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు. అయితే అభిషేక్ రెడ్డి మరణంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వివేకా చనిపోయారని దేవిరెడ్డి శివశంకరరెడ్డి తనకు ఫోన్‌ చేసి చెప్పినట్లు 2021 ఆగస్టులో అభిషేక్‌రెడ్డి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. అంతేకాదు ఘటనాస్థలానికి వెళ్లి చూడగా వివేకా బాడీ చుట్టూ రక్తపు మడుగు, ఆయన తలపై గాయాలున్నట్లు గుర్తించానని తెలిపారు. ఎంవీ కృష్ణారెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, అవినాష్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకరరెడ్డి,  వివేకా గుండెపోటుతో చనిపోయారని నమ్మించే ప్లాన్ చేసినట్లు అభిషేక్ రెడ్డి స్పష్టం చేశారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు