/rtv/media/media_files/2025/03/24/AsvHXuQHAdpM2GknCJgA.jpg)
Vijayawada Restaurants, hotels open till midnight
Hotels & Restaurant: భోజన ప్రియులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడ నగరంలో ఇకపై అర్ధరాత్రి 12గంటల వరకూ రెస్టారెంట్లు, హోటళ్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇచ్చింది. ఆదివారం రాత్రి నుంచే ఇవి అమల్లోకి వచ్చాయని పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు.
మొదట 3 నెలలు ప్రయోగాత్మకంగా..
ఈ మేరకు 2018లోనే చంద్రబాబు ప్రభుత్వం హోటళ్లను అర్ధరాత్రి వరకూ ఉంచేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయగా వైసీపీ ప్రభుత్వంలో దీనిపై ఆంక్షలు విధించారు. దీంతో మరోసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ లో మళ్లీ అర్థరాత్రి వరకు అమలు చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు తెలిపారు. మొదట 3 నెలలు ప్రయోగాత్మకంగా పరిశీలించనుండగా విజయవాడతోపాటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా అనుమతి ఇచ్చినట్లు చెప్పారు.
Also Read: రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందిగా!
ఇక విజయవాడకు రైళ్లు, బస్సుల్లో రాత్రి 10గంటల తర్వాత కూడా వేల సంఖ్యలో జనాలు వస్తున్నారని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. కానీ రాత్రి 9.30 దాటిన తర్వాత హోటళ్లు మూతపడటంతో ఆహారం కోసం ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. దీంతో ఏ పన్ను చెల్లించకుండా రోడ్ సైడ్ ఫుడ్ అమ్ముతున్న వారికి అర్ధరాత్రి వరకూ అనుమతి ఇస్తున్నారని, ప్రభుత్వానికి 13 రకాల పన్నులు చెల్లిస్తున్న తమకు కూడా అనుమతి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు. ఈ విషయాన్ని విజయవాడ హోటళ్ల అసోసియేషన్‌తో చర్చించిన కలెక్టర్ లక్ష్మీశ, పోలీసు కమిషనర్ రాజశేఖర్‌బాబు సానుకూలంగా స్పందిస్తూ అనుమతి ఇచ్చారు.
Also Read: Viral video: ఫోన్‌లో IPL మ్యాచ్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్.. భారీ జరిమానాతోపాటు..!
ఇక నగరంలో సభ్వత్వం ఉన్నవి 144 రెస్టారెంట్లు. 46 హోటళ్లు ఉన్నట్లు తెలిపారు. సభ్యత్వం లేని హోటళ్లు 200కు పైగానే ఉన్నట్లు గుర్తించారు. చెన్నై నుంచి పినాకినీ, హైదరాబాద్ నుంచి శాతవాహన, విశాఖ నుంచి రత్నాచల్ సహా నవజీవన్ లాంటి రైళ్లన్నీ రాత్రి 9 తర్వాతే విజయవాడకు చేరుకుంటాయి. బస్సుల్లోనూ తెల్లవారుజామున ఎక్కువమంది ప్రయాణికులు దిగుతుంటారు. ఈ ప్రయాణికులకు బందరు రోడ్డులో ఈట్‌స్ట్రీట్, బీఆర్‌టీఎస్ రోడ్డులో సత్యనారాయణపురం వద్ద ఫుడ్‌కోర్టులు తప్ప మరో హోటల్ లేవు. ఈ నేపథ్యంలోనే రాత్రి 12గంటల వరకూ తెరిచి ఉంచాలని రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.వి.స్వామి, విజయవాడ అధ్యక్షులు రమణ, కోశాధికారి మల్లిఖార్జున్ కోరగా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.
vijayawada | midnight | today telugu news rtv telugu news