Vallabhaneni Vamsi Arrest Case: నా భర్తను జైల్లో చంపేస్తారు.. వల్లభనేని వంశీ భార్య సంచలన ఆరోపణలు!

విజయవాడ సబ్ జైల్లో వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని ఆయన భార్య పంకజశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. జైల్లోనే వంశీని చంపేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. ఎవరినీ కలవనీయకుండా మెంటల్‌ టార్చర్ చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 

New Update
vallabaneni

Vallabhaneni Vamsi wife Sensational alligations on vijayawada jail

Vallabhaneni Vamsi Arrest Case: విజయవాడ(Vijayawada) సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ప్రాణహాని ఉందని ఆయన భార్య పంకజశ్రీ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం మూలాకత్‌లో వంశీని కలిసేందుకు వెళ్లిన ఆమె విజయవాడ సబ్ జైల్లో వంశీని చంపేందుకు కుట్ర చేస్తున్నారన్నారు. వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెన్నుపూస నొప్పితో, శ్వాసకోస సమస్యతో ఆయన బాధపడుతున్నారని, అలాంటి వంశీని మెంటల్‌గా టార్చర్ చేస్తున్నారని కన్నీరుపెట్టుకున్నారు.

ఇది కూడా చదవండి:  Tariffs: ట్రంప్ టారీఫ్ లతో భారత్ కు నష్టమా...లాభమా?

డాక్టర్లతో తప్పుడు ప్రచారం..

ఈ మేరకు మీడియాతో మాట్లాడిన పంకజశ్రీ.. వంశీని మానసికంగా కుంగ దీస్తున్నారు. వంశీ ఉన్న బారక్‌లో 60 సీసీ కెమెరాలు పెట్టారు. వంశీ ఆరోగ్యం బాగుందంటూ డాక్టర్లతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఈ వ్యవహారం మీద కోర్టుకు వెళ్తాం. జగన్ ఫోన్ చేసి నాకు ధైర్యం చెప్పారు. వచ్చేవారం వంశీని కలుస్తానని జగన్ చెప్పారు. వైసీపీ పార్టీ  అన్ని రకాలుగా అండదండలుగా ఉంటుందన్నారు. లీగల్ టీమ్‌ను కూడా ఏర్పాటు చేశారు. కేవలం రూ. 20 వేల కోసం తప్పుడు కేసులు పెట్టి టార్చర్ పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇది కూడా చదవండి: Elon Musk-Modi: ప్రపంచ కుబేరుడి పిల్లలకు ప్రత్యేక బహుమతులిచ్చిన భారత ప్రధాని..ఏమిచ్చారో తెలుసా!

అలాగే కేస్ ఫ్యాబ్రికెట్ చేస్తూ ఫాల్స్ అలిగేషన్ లు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. వంశీకి టైల్ బోన్ ఫ్రాక్చర్ అయింది. ఆరోగ్యం బాగోలేదని చెప్పారు. నేరం రుజువు కాకుండానే బంధించారు. ఫాల్స్ కేస్‌లో ఇంత పనిష్మెంట్ ఎందుకు. కింద పడుకుంటున్నారు. బెడ్ కావాలని రిక్వెస్ట్ చేశాం. జైల్‌లో ఒక సెల్‌లో బంధించి ఎవరిని కలవానివ్వకుండ ఇబ్బంది పెడుతున్నారు. ఫిజికల్ గా మెంటల్ టార్చర్ చేస్తున్నారని ఆవేదన చెందారు. 

ఇది కూడా చదవండి: TG News: 'సెక్రటేరియట్‌లో కలకలం.. సీఎం రేవంత్, మంత్రులకు ఫుడ్ పాయిజన్'!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు