రాక్షస రాజ్యంలో దేవుడి దగ్గరికి కూడా.. : జగన్ ఎమోషనల్
రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని జగన్ మండిపడ్డారు. దేవుడి దర్శనానికి వెళ్లేందుకు కూడా అడ్డుకునే పరిస్థితులను తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు.
రాష్ట్రంలో ఎప్పుడూ కూడా చూడని రాక్షస రాజ్యం నడుస్తోందని జగన్ మండిపడ్డారు. దేవుడి దర్శనానికి వెళ్లేందుకు కూడా అడ్డుకునే పరిస్థితులను తాను ఇప్పటి వరకు చూడలేదన్నారు.
తిరుపతి దేవస్థానంలో లడ్డూ వివాదం ఎఫెక్ట్ యూపీలోని పలు ఆలయాలకు తాకింది. పురాతన పద్ధతుల్లో ప్రసాదాలు చేయాలని మధురలోని ధర్మ రక్షా సంఘం నిర్ణయం తీసుకుంది. పండ్లు తదితర సహజసిద్ధమైన పదార్థాలతో ప్రసాదం తయారు చేయాలని పలు ఆలయాల నిర్వాహకులు నిర్ణయించారు.
మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ వివాదం, తిరుపతిలో పోలీసుల ఆంక్షలు, వైసీపీ నేతల ముందస్తు అరెస్టుల నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
AP: తిరుపతిలో మాజీ సీఎం జగన్ పై దాడికి కుట్ర జరుగుతోందని వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. తిరుమల పర్యటనలో ఆటంకాల్ని సృష్టిస్తూ భక్తుల ముసుగులో జగన్‌పై దాడికి కూటమి నేతలు డబ్బులిచ్చి గూండాలని పురిగొల్పుతున్నట్లు తమకు సమాచారం అందినట్లు పేర్కొంది.
AP: రేపు శ్రీవారిని దర్శించుకోనున్న జగన్‌కు షాక్ ఇచ్చేందుకు టీటీడీ అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన దగ్గర నుంచి డిక్లరేషన్‌పై సంతకం తీసుకోనున్నారు. ఒకవేళ నిరాకరిస్తే జగన్‌ను శ్రీవారి దర్శనానికి అనుమతిని నిరాకరించనున్నట్లు సమాచారం.
AP: మాజీ సీఎం జగన్ రెండు రోజుల పాటు తిరుమలలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం తిరుమలకు చేరుకుంటారు. రేపు శ్రీవారిని కాలినడకన దర్శించుకోనున్నారు. జగన్ రాకతో తిరుపతిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.
పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. 'గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు అయోమయం' అని ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
AP: జగన్ తిరుమల పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హీట్ పెంచింది. టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని పురందేశ్వరి అన్నారు. కాగా ఎల్లుండి తిరుమలకు కాలినడకన వెళ్లి శ్రీవారిని జగన్ దర్శించుకోనున్నారు.