నేడు తిరుపతికి సిట్ బృందం

ఈరోజు తిరుపతికి సిట్ బృందం వెళ్లనుంది. డీఐజీ త్రిపాఠి సహా సిట్ బృందంతో సమావేశం కానున్నారు. మొదట ఏఆర్‌ డైరీపై నమోదైన కేసుకు సంబంధించి ఈస్ట్లో PSలో విచారణ చేపట్టనున్నారు. లడ్డూ కల్తీ అంశంపై విచారణకు సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

New Update
SIT TIR

Tirupati Laddu: తిరుపతికి సిట్ బృందం చేరుకొంది. సిట్ చీఫ్ గా సర్వశ్రేష్ఠి త్రిపాటిని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. శ్రీవారి లడ్డూలో ఉపయోగించిన కల్తీ నెయ్యి వివాదం పై విచారణ చేయనున్నారు. మొదటి తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో  కేసును తమ పరిధిలోకి సిట్ తీసుకోనుంది. సిట్ బృందానికి కావలసిన సహకారాన్ని టీటీడీ అందించనుంది. గతంలో జరిగిన నెయ్యి సరఫరా, టెస్టింగ్, నాణ్యత ప్రమాణాలపై విచారణ చేయనున్నారు సిట్ అధికారులు. విచారణ అనంతరం నివేదిక ప్రభుత్వానికి సిట్ సమర్పించనుంది.

పర్యటన రద్దు చేసుకున్న జగన్...

మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు. డిక్లరేషన్ వివాదం, తిరుపతిలో పోలీసుల ఆంక్షలు, వైసీపీ నేతల ముందస్తు అరెస్టుల  నేపథ్యంలో జగన్ తన పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. తిరుపతి లడ్డూ కల్తీ జరిగిందంటూ చంద్రబాబు అసత్య ప్రచారం చేసి ఆలయ ప్రతిష్టను దెబ్బ తీశాడని జగన్ ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని ప్రక్షాళన చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో సెప్టెంబరు 28, శనివారంరోజున పూజల్లో పాల్గొనాలని ఈ నెల 25న జగన్ పిలుపునిచ్చారు. అదే రోజు తాను తిరుమలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటానని తెలిపారు. కాగా వివాదాల ఆంక్షల నడుమ జగన్ తన తిరుపతి పర్యటనను రద్దు చేసుకున్నారు.

Also Read: మూసీలో ఇళ్ల సర్వేపై హైడ్రా కమిషనర్‌ కీలక ప్రకటన

Advertisment
Advertisment
తాజా కథనాలు