Prakash Raj : పవన్‌ను టార్గెట్ చేస్తూ ప్రకాష్‌రాజ్ సంచలన ట్వీట్

పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ నటుడు ప్రకాష్ రాజ్ మరో ట్వీట్ చేశారు. 'గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు అయోమయం' అని ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్ ట్వీట్‌పై జనసైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Prakash Raj:  దయచేసి క్షమించు.. నటుడు ప్రకాశ్‌రాజ్ ఎమోషనల్ ట్వీట్..!!

Prakash Raj: డిప్యూటీ సీఎం పవన్‌, ప్రకాష్ రాజ్ మధ్య లడ్డూ వివాదం ముదురుతోంది. తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్‌రాజ్‌ ట్వీట్‌కు పవన్‌ కౌంటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పవన్‌కు నటుడు ప్రకాష్‌రాజ్‌ రీకౌంటర్‌ ఇస్తున్నారు. గెలిచేముందు ఒక అవతారం.. గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఎందుకు అయోమయం అని ట్వీట్ చేశారు. నిన్న చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.

హీరో కార్తీకి మద్దతుగా...

నటుడు ప్రకాష్ రాజ్.. కార్తీ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పడం పై సంచలన పోస్ట్ పెట్టారు. ''చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో!'' జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ ను ఉద్దేశిస్తూ వెటకారంగా ట్వీట్ చేశారు.

ఇది ఇలా ఉంటే లడ్డూ విషయంలో  పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే తిరుమల లడ్డూ వివాదంపై ప్రకాష్ రాజ్ చేసిన  వ్యాఖ్యలకు పవన్ కళ్యాణ్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ''జరిగింది తెలుసుకుని మాట్లాడాలని ప్రకాష్ రాజ్ కు సూచించారు. దీనిపై మళ్ళీ ప్రకాష్ రాజ్ రియాక్ట్ అవుతూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం తాను విదేశాల్లో ఉన్నానని, వచ్చాక పవన్‌ కళ్యాణ్ ప్రశ్నలకు సమాధానమిస్తానని తెలిపారు. లడ్డూ వివాదం గురించి తాను చేసిన వ్యాఖ్యలు అర్థం కాకపోతే మరొకసారి తన ట్వీట్ చదువుకోండి అంటూ  పవన్ కు కౌంటర్ ఇచ్చారు. 

Also Read :  జగన్ తిరుమల పర్యటనపై ఏపీలో రచ్చ

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో రాబోయే 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

New Update
Rains

Rains

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో రాబోయే రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌, వరంగల్, ఖమ్మం, సిద్దిపేట, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు వర్ష సూచన ఉంది. అటు ఆంధ్రప్రదేశ్‌లో 3 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment