డిక్లరేషన్ తప్పనిసరి.. జగన్‌కు టీటీడీ అధికారులు షాక్

AP: రేపు శ్రీవారిని దర్శించుకోనున్న జగన్‌కు షాక్ ఇచ్చేందుకు టీటీడీ అధికారులు సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈరోజు ఆయన దగ్గర నుంచి డిక్లరేషన్‌పై సంతకం తీసుకోనున్నారు. ఒకవేళ నిరాకరిస్తే జగన్‌ను శ్రీవారి దర్శనానికి అనుమతిని నిరాకరించనున్నట్లు సమాచారం.

New Update
JAGAN DEC

Jagan: ఇవాళ తిరుమలకు మాజీ సీఎం జగన్ వెళ్లనున్న సంగతి తెలిసిందే. రేపు శ్రీవారిని ఆయన దర్శించుకోనున్నారు. ఈ క్రమంలో టీటీడీ అధికారులు జగన్ కు షాక్ ఇచ్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. జగన్‌ నుంచి అన్యమతస్తుల డిక్లరేషన్‌ కోరేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు రెడీ అవుతున్నారు. గెస్ట్‌హౌస్‌లోనే జగన్‌కు డిక్లరేషన్‌ ఫారంను అధికారులు అందించనున్నారు.

జగన్‌ సంతకం చేస్తేనే దర్శనానికి అనుమతి ఇవ్వాలని టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జగన్ తిరస్కరిస్తే చట్టం ప్రకారం నడుచుకుంటాం అని అధికారులు తెలిపారు. జగన్ సంతకం పెట్టకపోతే శ్రీవారి దర్శనానికి అనుమతించబోమని తేల్చి చెప్పారు. అన్యమతస్తులు వస్తే 17 వ కంపార్ట్‌మెంట్ దగ్గర డిక్లరేషన్‌పై సంతకం చేయాల్సిందే అని అన్నారు. వీఐపీలు వచ్చినపుడు గెస్ట్‌హౌస్‌ దగ్గరే సంతకం తీసుకుంటామని అధికారులు తెలిపారు.

డిక్లరేషన్ అంటే ఏంటి? 

టీటీడీ నిబంధనలు ప్రకారం అన్యమతస్తులు శ్రీవారి దర్శనానికి వచ్చినపుడు కచ్చితంగా అఫిడవిట్ సమర్పించాలి. దేవాదాయశాఖ చట్టం 30/1987ని అనుసరించి 1990లో అప్పటి ప్రభుత్వం ఒక జీవోను విడుదల చేసింది. దీన్ని అనుసరించి హిందువులు కాని వ్యక్తులు, అన్యమతస్తులు శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించాలంటే ముందుగా డిక్లరేషన్‌ ఫారంపై సంతకం పెట్టాలి. తాను వేరే మతానికి సంబంధించిన వ్యక్తినని, అయినా శ్రీవెంకటేశ్వరస్వామిపై నమ్మకం, గౌరవం ఉన్నందున తనను దర్శనం అనుమతించాలని కోరుతూ వివరాలు పొందుపరిచి,సంతకం చేయాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు