Aghori: శ్రీకాళహస్తిలో అఘోరీకి స్పెషల్ ట్రీట్మెంట్
ఎట్టకేలకు అఘోరీ వస్త్రధారణ పాటించి శ్రీకాళహస్తి ఆలయం వద్దకు చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. పోలీసులు కూడా ఆమె దర్శనానికి వచ్చిన సమయంలో కొంత హడావుడి చేశారు.
ఎట్టకేలకు అఘోరీ వస్త్రధారణ పాటించి శ్రీకాళహస్తి ఆలయం వద్దకు చేరుకొని స్వామి వారిని దర్శించుకున్నారు. పోలీసులు కూడా ఆమె దర్శనానికి వచ్చిన సమయంలో కొంత హడావుడి చేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షమైన అఘోరీ తాజాగా శ్రీకాళహస్తి ఆలయానికి చేరుకుంది. ఆలయంలోకి అనుమతించకపోవడంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్లే ప్రసక్తే లేదని.. కావాలంటే గన్ తో చంపేయండని ఫైర్ అయింది.
తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణను చేపడుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు పదార్థాలు ఉన్నాయా? లేదా? అన్న కోణంలో కమిటీ విచారిస్తోంది. త్వరలోనే నిజాలు బయటపడనున్నాయి.
చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి టీడీపీలో చేరారు.
తిరుపతికి చెందిన లోకేశ్వరి ఎంజాయ్ చేద్దామని స్నేహితురాలితో కలిసి శిల్పారామానికి వెళ్లింది. సరదాగా క్రాస్ వీల్ ఎక్కగా అది ఒక్కసారిగా ఊడిపడింది. దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో లోకేశ్వరి మృతి చెందగా.. తన స్నేహితురాలు తీవ్ర గాయాలతో బయటపడింది.
రాబోయే ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా వైసీపీ పార్టీ విజయం సాధిస్తుందని ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు. భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరైన విజయసాయి రెడ్డి 2027 చివరిలో జమిలి ఎన్నికలు జరుగుతాయన్నారు.
తిరుమలలో పని చేసే వారు కేవలం హిందువులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటామన్న టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు వ్యాఖ్యలకు అసదుద్దీన్ ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. టీటీడీలో అన్యమతస్తులు ఉండనప్పుడు.. వక్ఫ్ బోర్డులలో మాత్రం ఎందుకంటూ ప్రశ్నించారు.
తిరుపతి జిల్లా వడమాటపేట మండలంలో దారుణం జరిగింది. సుశాంత్ అనే యువకుడు తన సమీప బంధువైన మూడున్నరేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశ జూపి అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన లడ్డూ వివాదంపై విచారణ కొనసాగుతోంది. ఇండియా టుడే దీనిపై శ్రీరామ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సెంటర్‌తో కలిసి విచారణ జరిపింది. కాగా రిపోర్టులో లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని తేల్చి చెప్పింది.