Tirupati: తిరుపతి లడ్డూ వివాదం..రంగంలోకి దిగిన CBI

తిరుపతి లడ్డూ కల్తీ వివాదంపై సీబీఐ రంగంలోకి దిగింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో సీబీఐ నేతృత్వంలో ఏర్పాటైన సిట్ బృందం విచారణను చేపడుతోంది. లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు పదార్థాలు ఉన్నాయా? లేదా? అన్న కోణంలో కమిటీ  విచారిస్తోంది. త్వరలోనే నిజాలు బయటపడనున్నాయి.

author-image
By srinivas
New Update
de

Tirupati laddu: తిరుపతి లడ్డూ కల్తీపై నిగ్గు తేల్చేందుకు ఐదుగురు సభ్యుల గల బృందం ఇప్పటికే తిరుమల చేరుకుంది. హైదరాబాద్ సీబీఐ జాయింట్‌ డైరెక్టర్  వీరేష్ ప్రభు, విశాఖపట్నం సీబీఐ ఎస్పీ మురళి రంభ కమిటీ సభ్యులుగా ఉన్నారు.  ఏపీ పోలీస్ శాఖ నుంచి విశాఖ రేంజ్‌ డీఐజీ గోపీనాథ్‌ జెట్టి, గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠిని సిట్‌ సభ్యులుగా నియమించింది. ఎస్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి మరో సభ్యుడని ప్రకటించాల్సి ఉంది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో సిట్‌ బృందం విచారణ  చేస్తోంది. తిరుమల శ్రీవారి కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీం కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై విచారణ బృందం ఆరా తీస్తోంది. నెయ్యి యొక్క కల్తీ రేటెడ్ నమూనాలపై ప్రయెగశాల నివేదికలను సిట్ పరిశీలిస్తోంది. సెంటర్ ఆఫ్ ఎనాలిసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ ల్యాబ్ ఇచ్చిన నివేదికలను పరిశీలించడానికి సిట్‌ రెడీ అవుతోంది. 

ఇది కూడా చదవండి: US President: 248 ఏళ్ల చరిత్రలో.. ఆమెకు అమెరికా అందని ద్రాక్షే!

కీలక ఆదేశాలు జారీ.. 

తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వినియోగించారన్న ఆరోపణలపై సీబీఐతో విచారణ జరిపాలని సుప్రీం కోర్టులో పలువురు ప్రముఖులు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కేవీ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో స్వతంత్ర సిట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ సిట్ టీమ్‌లో సీబీఐ నుంచి ఇద్దరు, ఏపీ ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీసు అధికారులు, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ నుంచి ఒక సీనియర్‌ అధికారి సభ్యులుగా ఉండాలని సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది. అలాగే స్వతంత్ర సిట్‌ దర్యాప్తును సీబీఐ డైరెక్టర్‌ పర్యవేక్షిస్తారని తెలియజేసింది.

ఇది కూడా చదవండి: Pawan Vs Stalin: పవన్ Vs స్టాలిన్.. దక్షిణాదిలో బీజేపీ బిగ్ స్కెచ్!

 ఇది ఇలా ఉంటే.. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయడంతో దేశ వ్యాప్తంగా దుమారం రేగింది. తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి... జంతు కొవ్వు ఉందా లేదా అన్నది విచారణ బృందం తేల్చవలసి ఉంది.

 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Veeraiah Chowdary Murder Case : టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకేసులో కీలక పరిణామం..నిందితులు ఎవరంటే...

ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి  హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఐదుగురు దుండగులు ఆయనను హత్య చేసి పారిపోయారు. ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. వీరయ్య హత్య జరిగిన సమయంలో నిందితులు వాడిన స్కూటీని గుర్తించారు.

New Update
Veeraiah Chowdary Murder Case

Veeraiah Chowdary Murder Case

Veeraiah Chowdary Murder Case : ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత, మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి  హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఐదుగురు దుండగులు ఆయనను హత్య చేసి పారిపోయారు. ఈ కేసులో పోలీసులు కొంత పురోగతి సాధించారు. వీరయ్య హత్య జరిగిన సమయంలో నిందితులు వాడిన స్కూటీని గుర్తించారు. చీమకుర్తి బైపాస్ రోడ్డులోని ఓ దాబా వద్ద స్కూటీ ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులు సంతనూతలపాడు , చీమకుర్తి వైపు పరారీ అయినట్లు గుర్తించారు. కాగా పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరగంధం దేవేంద్రనాథ్ చౌదరి, ముప్పా సురేష్ అతని సమీప బంధువు ఆళ్ల సాంబశివరావులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో పలు గ్రూపుల్లో వీరయ్యను దూషిస్తూ దేవేంద్రనాథ్‌ చౌదరి పోస్టులు పెట్టినట్లు గుర్తించిన పోలీసులు.

Also Read: Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?'

వీరయ్య హత్య కేసు రోజుకో మలుపు... పూటకో ట్విస్ట్ నెలకొంటుంది.రాజకీయ వైరం, వ్యాపార శతృత్వమే వీరయ్య చౌదరి హత్యకు ప్రధాన కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య జరిగిన రోజు అనుమానితులు.. హంతకులు కలిసి ఒక దాబాలో భోజనం చేసినట్లు తెలుస్తోంది. - కాల్ డేటా ఆధారంగా హత్యలో ఎవరెవరికి సంబంధం ఉందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. హంతకుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రకాశం, నెల్లూరు, గుంటూరుజిల్లాలో పోలీసులు గాలిస్తున్నారు. కేసు పురోగతి కోసం జిల్లా ఎస్పీ మరికొన్ని టీం లను ఏర్పాటు చేశారు. వీరయ్య హత్య కేసుకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధిని సైతం పోలీసులు విచారించేందుకు సిద్ధమవుతున్నారు.

Also Read: PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
 
కాగా టీడీపీ నేత, మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరయ్య చౌదరి ఈ నెల 23న దారుణ హత్యకు గురయ్యారు. ఒంగోలులోని తన కార్యాలయంలో ఉండగా మాస్కులు ధరించి రెండు బైకులపై వచ్చిన ఐదుగురు దుండగులు కత్తులతో దాడి చేశారు. వీరయ్య చౌదరి ఛాతీ, గొంతు, పొట్టపై పదిహేను కత్తి పోట్లు పొడిచారు. అనంతరం పారిపోయారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వీరయ్య చౌదరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

Also Read: Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?

Advertisment
Advertisment
Advertisment