టీటీడీ కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు.. 24 మంది సభ్యులతో కొత్త బోర్డు
టీటీడీ కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది.
టీటీడీ కొత్త ఛైర్మన్‌గా బీఆర్ నాయుడు నియమితులయ్యారు. మొత్తం 24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలక మండలి ఏర్పాటు కానుంది. ఈ మేరకు టీటీడీ బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది.
కాణిపాకంశ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్.సోమశేఖర్ గురుకుల్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు ఈవో పి.గురుప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
AP: హైకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దక్కింది. పుంగనూరు అల్లర్ల కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ లభించింది. ఆయనతో పాటు మిగతా ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అక్టోబర్ 31న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. దీపావళి ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది.
తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ ఆగడం లేదు. వరుసగా మూడో రోజు ఉగ్రవాద సంస్థలు మెయిల్స్ పంపాయి. జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బెదిరింపులు వచ్చిన హోటళ్లను పోలీసులు తనిఖీ చేశారు.
తిరుపతిలోని హోటళ్లకు వరుస బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాజాగా కపిల తీర్థం దగ్గర్లోని రాజ్‌పార్క్ హోటల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులు పంపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హోటల్లో తనికీ చేయగా ఎక్కడా పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో జనాలు ఊపిరి పీలుచుకున్నారు.
తిరుపతిలోని పలు హోటళ్లకు బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. లీలామహల్ సమీపంలోని మూడు ప్రైవేట్ హోటళ్లు, రామానుజ కూడలిలోని మరో హోటల్ కు గురువారం మెయిల్ లో బెదిరింపులు రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
దీపావళి పండుగ నేపథ్యంలో రైల్వే శాఖ.. ఏకంగా 7 వేల స్పెషల్ ట్రైన్లను నడపాలని నిర్ణయం తీసుకుంది.ఇందులో.. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 1400 ప్రత్యేక రైళ్లను నడిపించనుండగా.. ఉత్తర మధ్య రైల్వే పరిధిలో 3050 స్పెషల్ ట్రైన్స్‌ను నడపనున్నారు.