Tirumala: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..ఎప్పుడంటే! అక్టోబర్ 31న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు. ఈ విషయాన్ని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. దీపావళి ఆస్థానం సందర్భంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. By Bhavana 28 Oct 2024 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు టీటీడీ ఓ ముఖ్య విషయాన్ని చెప్పింది. అక్టోబర్ 31న తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేస్తున్నట్లు తెలిపింది. దీపావళి పండుగను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. Also Read: ఏపీకి వెళ్లిన ఐఏఎస్‌లకు కీలక పోస్టింగ్‌లు.. ఆమ్రపాలికి ఏదంటే? ఆస్థానం సందర్భంగా స్వయంగా ఆలయానికి వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులు మినహా మిగతా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ 30వ తేదీన సిఫార్సు లేఖలను స్వీకరించలేమని చెప్పింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే నెలలో విశేష ఉత్సవాలు మరోవైపు ప్రతి నెలా విడుదల చేసిన విధంగానే ఈసారి కూడా టీటీడీ రాబోయే నెలలో జరిగే విశేష ఉత్సవాల గురించి తెలిపింది. తర్వాత నెలలో తిరుమలలో జరిగే విశేష ఉత్సవాల గురించి టీటీడీ ముందు నెలలోనే భక్తులకు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. ఈ క్రమంలోనే నవంబర్ నెలలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాల జాబితాను టీటీడీ వెల్లడించింది. తిరుమలలో నవంబరు 1న కేదారగౌరీ వ్రతం నిర్వహించబోతున్నారు. అలాగే నవంబరు 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర నిర్వహిస్తారు. Also Read: ఆ మూడు సినిమాలు కలిపితే 'కల్కి 2'.. అంచనాలు పెంచేసిన నాగ్ అశ్విన్ ఇక నవంబరు 5న నాగుల చవితి వేడుకలు జరగనున్నాయి. అలాగే నాగుల చవితిని పురస్కరించుకుని పెద్ద శేష వాహనసేవ ఉంటుంది. నవంబరు 6వ తేదీన శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, నవంబరు 8న వార్షిక పుష్పయాగానికి అంకురార్పణ జరుపుతారు. నవంబర్ 9వ తేదీన శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలోకాచార్య వర్ష తిరు నక్షత్రం, పోయిగైయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర జరుపుతారు. నవంబర్ 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, 12న ప్రబోధన ఏకాదశి కార్యక్రమం ఉంటుంది. Also Read: జన్వాడ పార్టీ కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు! తిరుమలలో నవంబరు 13న కైశిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి ఉంటుంది. నవంబరు 15న కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహిస్తారు. నవంబర్ 28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రి వేడుకలు ఉంటాయని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. Also Read: తెలంగాణలో 10 మంది ఎస్పీలు డిస్మిస్...! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి