విదేశీయుల్ని లేపేస్తాం తిరుపతిలో మళ్లీ బాంబులు!

తిరుపతిలోని హోటళ్లకు వరుస బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. తాజాగా కపిల తీర్థం దగ్గర్లోని రాజ్‌పార్క్‌ హోటల్‌ను పేల్చేస్తామంటూ బెదిరింపులు పంపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు హోటల్లో తనికీ చేయగా ఎక్కడా పేలుడు పదార్థాలు దొరకలేదు. దీంతో జనాలు ఊపిరి పీలుచుకున్నారు.

New Update

 Tirupati: తిరుపతిలోని పలు హోటళ్లకు వరుస బాంబ్ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. గురువారం లీలామహల్ సెంటర్‌లోని 3 హోటల్స్‌కు, రామానుజ కూడలిలోని మరో హోటల్‌కు ఫేక్ బాంబు బెదిరింపుల రాగా పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే తాజాగా తిరుపతిలోని మరో హోటల్లో బాంబ్ పెట్టినట్లు బెదింపులు రావడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది. 

మరో బాంబ్ బెదిరింపు 

ఈరోజు మళ్ళీ  కపిల తీర్థం దగ్గర్లోని రాజ్‌పార్క్‌ హోటల్‌ను పేల్చేస్తామంటూ  మెయిల్ ద్వారా బెదిరింపులు  పంపారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు హోటల్లో తనికీ చేయగా ఎక్కడా పేలుడు పదార్థాలు దొరకలేదు. బాంబులు లేవని తేల్చడంతో  జనాలు ఊపిరి పీలుచుకున్నారు. ఇలా పలు సార్లు ఫేక్ బాంబు ఇలా  బెదిరింపులు రావడంతో..  దీని వెనుక ఎవరున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Also Read: దీపావళి పండుగ వేళ 7 వేల స్పెషల్ ట్రైన్స్

 అయితే ఇటీవలే  తమిళనాడులో ఉగ్రవాది జాఫర్‌ సాదిక్‌ కు జైలు శిక్ష పడింది. ఆ శిక్ష పడేందుకు ప్రభుత్వం తరుఫున తమిళనాడు సీఎం స్టాలిన్‌ సహకారం అందించారు. సీఎం కుటుంబంతో పాటు తమిళనాడులోని కొన్ని స్కూళ్లలో పేలుళ్లకు ఐఎస్‌ఐ పూనుకొంది. అని మెయిల్‌ లో పేర్కొన్నారు. అందులో భాగంగా తిరుపతిలోని నాలుగు ప్రైవేట్‌ హోటళ్లను పేల్చివేస్తామని హెచ్చరించారు. దీంతో వెంటనే అప్రమత్తం అయిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఎక్కడా పేలుడు పదార్థాలు లేవని నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

విమానానికి కూడా..

తిరుపతి విమానాశ్రయంలో స్టార్‌ ఎయిర్‌ లైన్స్‌ కు చెందిన ఎస్‌ 5-154 విమనానికి గురువారం బాంబు బెదిరింపు వచ్చింది. ఆదమ్‌ లాన్‌ జా 33 3 పేరుతో ఉన్న ఎక్స్‌ ఖాతా నుంచి బెదిరింపు సందేశాన్ని పంపారు. దీని పై కేసు నమోదు చేసినట్లు సీఐ వివరించారు. వరుసగా విమానాలకు బాంబు బెదిరింపులు రావడంతో ప్రస్తుతం విమాన ప్రయాణాలు చేయాలంటే వణుకుతున్నారు. గత ఆరు రోజుల్లో మొత్తం 70 బాంబు బెదిరింపులు విమాన సంస్థలకు వచ్చినట్లు తెలుస్తోంది. కేవలం దేశీయ విమానాలు మాత్రమే కాకుండా అంతర్జాతీయ విమానాలకు కూడా బాంబు బెదిరింపులు వస్తాన్నాయి. దీంతో ప్రయాణికులతో పాటు అధికారులు కూడా భయపడుతున్నారు. ఇటీవల లండన్ నుంచి ఢిల్లీ వెళ్తున్న విమానంతో పాటు పలు ఎయిర్ లైన్స్‌కు కూడా వచ్చిన బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం సృష్టిస్తున్నాయి. 

వరుస బాంబు బెదిరింపులు..

శనివారం ఢిల్లీ నుంచి లండన్‌కు బయలు దేరిన విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే విమానాన్ని ఫ్రాంక్‌ఫర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి తనిఖీ చేశారు. రెండు గంటలు పాటు విమానాన్ని తనిఖీ చేయగా ఎలాంటి అనుమానస్పదమైన వస్తువలు దొరకలేదని అధికారులు తెలిపారు. అయితే గత పది రోజుల నుంచి బాంబు బెదిరింపుల కాల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. న్యూఢిల్లీ నుంచి బెంగళూరుకి బయలు దేరిన ఆకాశ ఎయిర్‌ లైన్స్‌కి అక్టోబర్ 16వ తేదీన బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో వెంటనే విమానాన్ని ఢిల్లీకి తీసుకొచ్చి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

Also Read: ఏపీపై దానా తుపాన్‌ ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు