Telangana: ఆంధ్ర ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లో తిరగనివ్వం..!
టీటీడీ తెలంగాణ సిఫారసు లేఖలు రద్దు చెయ్యడం బాధాకరమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. టీటీడీలో తెలంగాణ భక్తులకు దర్శనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
టీటీడీ తెలంగాణ సిఫారసు లేఖలు రద్దు చెయ్యడం బాధాకరమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అన్నారు. టీటీడీలో తెలంగాణ భక్తులకు దర్శనాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారన్నారు.
చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ భరత్ కనబడుటలేదంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటం కుప్పంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భరత్ ఆచూకీ తెలిస్తే తమకు సమాచారం ఇవ్వాలంటూ వైసీపీ కార్యకర్తలు వాల్ పోస్టర్లు వేయడం కలకలం రేపుతోంది.
AP: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విచారణకు రావాలని కోరారు. కాగా తిరుమల మాఢవీధుల్లో పబ్లిక్ న్యూసెన్స్ చేస్తూ రీల్స్ చేశారని టీటీడీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ములకలచెరువులో అభయాంజనేయ స్వామి ఆలయం ధ్వంసం కేసులో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ పూజారే ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది.
తాజాగా యాదాద్రిలో ప్రసాదాల కోసం వాడుతున్న నెయ్యి స్వచ్ఛమైనదే అని తేలింది. ఇక్కడ వాడుతున్న నెయ్యి టెస్ట్‌లలో పాసయిందని నిర్ధారించారు. దాంతో పాటూ నెయ్య వివరాలను కూడా తెలిపారు. దీంతో తిరుమల లడ్డూ వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, కుప్పం పరిశీలకుడు గాజుల ఖాదర్ భాషా రాసలీలల వ్యవహారం బట్టబయలైంది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఖాదర్ భాషా లైంగిక దాడికి పాల్పడిన విషయం బయటకొచ్చింది. పింఛన్లు, ఇంటిస్థలాలు ఇప్పిస్తానని లైంగికదాడి చేశాడంటూ ఓ మహిళ బహిర్గతం చేసింది.
AP: ఈరోజు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణస్వీకారంతో పాటు ఎన్డీయే పక్ష నేతల సమావేశంలో వారు పాల్గొననున్నారు.
రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.