AP: నేడు ఈ జిల్లాల్లో పాఠశాలలకు సెలవు

రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు.

New Update
schools leaves

దసరా సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు, కాలేజీలకు భారీగా సెలవులు ప్రకటించారు. అయితే ఈ సెలవులు మూడు రోజుల క్రితం ముగిసాయి. అన్ని చోట్ల విద్యాసంస్థలు మళ్లీ తెరుచుకున్నాయి. ఎక్కువగా సెలవులు రావడంతో విద్యార్థులు బాగా ఎంజాయ్ చేశారు. అయితే ఇప్పుడు మరికొన్ని స్కూళ్లకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.

ఇది కూడా చదవండిః మత్తు స్ప్రే చల్లి, న్యూడ్ వీడియోలు తీసి.. జాయ్‌ పై మరో కేసు నమోదు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉదయం పశ్చిమ వాయువ్య దిశగా పయనించింది. దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాలపై తీవ్ర అల్పపీడనంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇందులో భాగంగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. 

ఇది కూడా చదవండిః విచారణకు రమ్మన్నారు.. సజ్జల అరెస్ట్ తప్పదా?

రాష్ట్రంలో కొన్ని జిల్లాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. నెల్లూరు, కడప, చిత్తూరు, ప్రకాశం, గుంటూరు వంటి జిల్లాల్లో వరద ముప్పు అధికంగా ఉందని తెలిపింది. ఇప్పటికే అధిక వర్షాల కారణంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆ బీభత్సం కాస్త ఇప్పుడు ఏపీ వైపుకు తిరిగింది. ఏపీలో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం చూపనుంది. వీటన్నింటి దృష్టిలో ఉంచుకుని ఏపీ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 

ఇది కూడా చదవండిః మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. పోలీసుల అదుపులో అగ్రనేత సుజాత?

ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తాజాగా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో నేడు పలు జిల్లాల్లో స్కూళ్లకు కలెక్టర్లు సెలవు ప్రకటించారు. ముఖ్యంగా ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో సెలవు మంజూరు చేశారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో కలెక్టర్లు సెలవు ప్రకటించినా విద్యాసంస్థలు నడపటంపై విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఇది కూడా చదవండిః సీఎం చంద్రబాబుకు జగన్ షాక్!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు