/rtv/media/media_files/2025/02/19/CZ1L32rmOFZSnqEeCmR4.jpg)
Tirumala, board member Naresh Kumar verbally assaulted a TTD employee
ప్రపంచంలోనే అత్యంత ఆధ్యాత్మిక దేవస్థానంగా తిరుమల తిరుపతి (Tirupati) ఆలయం పేరుగాంచింది. గోవింద నామస్మరణలతో నిత్యం మారుమోగుతూ ఉంటుంది. దేశ విదేశాల నుంచి భక్తులు, పర్యాటకులు ఈ దేవస్థానాన్ని దర్శించుకునేందుకు వస్తారు. అలాంటి ఈ ఆలయంలో తాజాగా ఊహించని సంఘటన జరిగింది. టీటీడీ బోర్డు మెంబర్ నరేష్ కుమార్.. టీటీడీ ఉద్యోగిపై బూతులతో రెచ్చిపోయారు.
చుట్టూ అందరూ ఉన్నా నోటిని అదుపుచేసుకోలేకపోయారు. మహాద్వారం నుంచి ఎవరినీ బయటకు పంపట్లేదన్న జవాబుకు.. నరేష్ కుమార్ బూతులతో విరుచుకుపడ్డారు. నిన్ను ఇక్కడ పెట్టిందెవరు? అంటూ ఆలయం ఎదుటే దూషించారు. ఏయ్ ఏమనుకుంటున్నావ్..? ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? నువ్ వెంటనే బయటకు పో.. ఎవరయ్యా థర్డ్ క్లాస్ వాడివి.. నువ్ నాకు చెప్తావా? వాడి పేరేంటి? అంటూ నోటికొచ్చిన పరుష పదజాలంతో చెలరేగిపోయారు.
Also Read: Anand Mahindra: భారత్ లో టెస్లా..ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!
దీంతో చుట్టూ ఉన్న భక్త జనం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఉద్యోగి మనోభావాలు దెబ్బతీనేలా ఆయన ప్రవర్తించిన తీరును పలువురు తప్పుబడుతున్నారు. ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందిన ఇలాంటి ఆలయంలో బోర్డు సభ్యుడు భక్తిశ్రద్ధలతో ఉండాల్సింది పోయి బూతులు మాట్లాడటం ఏంటని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భక్తులకు, ఉద్యోగులకు, సిబ్బందికి ఎంతో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి సహనం కోల్పోయి వీధిరౌడీలా దూషించడం సరికాదంటున్నారు. ఆయన తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే నో రిఫండ్.. ఐటీ శాఖ ఏమందంటే!
ఏం జరిగిందంటే?
టీటీడీ బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మహాద్వారం నుంచి బయటకు వెళ్లాలని అనుకున్నారు. దీంతో బోర్డు సభ్యుడి సహాయకుడు గేటు తీయాలని టీటీడీ (TTD) ఉద్యోగి బాలాజీని కోరారు. కానీ అతడు మాత్రం.. మహాద్వారం నుంచి ఎవరినీ బయటకు పంపడం లేదని.. ఏదైనా అభ్యంతరం ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించాలని చెప్పాడు.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!
దీంతో బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ సహనం కోల్పోయి నోటికి వచ్చిన బూతులను తిట్టారు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలీదా? అంటూ విరుచుకుపడ్డారు. నువ్ బయటకు పో అంటూ దూషించారు. ఇంతలో టీటీడీ వీజీఓ సురేంద్ర, పోటు ఏఈఓ మునిరత్నం అక్కడకు చేరుకున్నారు. అనంతరం నరేష్ కుమార్‌కు సర్దిచెప్పి మహాద్వారం నుంచి బయటకు పంపించారు.