/rtv/media/media_files/2025/03/18/1lhdyPgjm0jfCPP6bci8.jpg)
Stone attack on police
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట..పెనుగంచిప్రోలు (Penuganchiprol) లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాల్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మూడు రాజకీయ పార్టీల ప్రభల ఊరేగింపులో పరస్పరం దాడులు చేసుకున్నారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జీ చేయాల్సి వచ్చింది. దీంతో రెచ్చిపోయిన రాజకీయ పార్టీల కార్యకర్తలు పోలీసులపై రాళ్లు రువ్వారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!
Stone Attack On Police - Penuganchiprol
పెనుగంచిప్రోలులక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాల్లలో తెలుగుదేశం (TDP), జనసేన (Janasena), వైఎస్సార్‌సీపీ (YSRCP) నేతల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు జరిగింది. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.కార్యకర్తలు రెచ్చిపోయి కవ్వింపు చర్యలకు దిగారు. పోలీసులపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో జగ్గయ్యపేట సీఐ వెంకటేశ్వర్లు తలకు బలమైన గాయాలు అయ్యాయి. పోలీస్ స్టేషన్ సెంటర్ లో వైసీపీ ప్రభ బండ్లను ఎక్కువసేపు ఆపి, టీడీపీ ఎడ్లబండ్ల ను పోలీసులు పంపడంతో ఇరువర్గాల మద్య ఘర్షణ చెలరేగింది.ఈ దాడిలో తెలుగుదేశం కార్యకర్తలు కూడా గాయపడ్డారు.
Also Read: Ap Crime: నిన్న కాకినాడ..నేడు కోనసీమలో దారుణం..కాలయములవుతున్న కన్నతండ్రులు!
Also Read : బైడెన్ పిల్లలకు సీక్రెట్ సర్వీస్ రక్షణను తొలగించిన ట్రంప్!
అడ్డుకున్న పోలీసు సిబ్బందిపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలురాళ్లతో దాడులు చేశారు. ఈ ఘటనలో పోలీసులకు గాయాలయ్యాయి. లక్ష్మీ తిరుపతమ్మ చిన్న తిరుణాలలో తెలుగుదేశం , జనసేన , వైఎస్సార్‌సీపీ నేతల ఆధ్వర్యంలో ప్రభల ఊరేగింపు జరిగింది. టీడీపీకి చెందిన ప్రభ సెంటర్లో ఉండగా, వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రభ వర్గం రెచ్చగొట్టే చర్యలకు దిగింది. వాటర్ ప్యాకెట్లు బాటిళ్లు రాళ్లు విసిరారు. ఇది గమనించిన పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు వెళ్లారు. దీంతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పోలీసులపైనా రాళ్లు, వాటర్ ప్యాకెట్‌లు విసిరారు. ఈ ఘటనలో నలుగురు పోలీసు సిబ్బంది, ప్రజలకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. రెచ్చగొట్టేలా దాడులు చేసిన వారిపై కేసు నమోదు చేశారు. ఒక ఏఎస్ఐ కు, నలుగురు కానిస్టేబుల్స్ కి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు.
Also Read: TTD: తిరుమల వెళ్లే భక్తులకు బ్యాడ్ న్యూస్..ఆ రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!