Maoist: ‘ఆపరేషన్‌ కగార్‌’ వెంటనే ఆపండి.. సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఫ్రొపెసర్ డిమాండ్!

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్‌ కగార్‌’ను వెంటనే ఆపివేయాలని ప్రొఫెసర్ జి.హరగోపాల్‌ డిమాండ్ చేశారు. ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. దేశంలో అభివృద్ధి నమూనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు.

New Update
oparation kagar

Professor G. Haragopal demanded an immediate halt to Operation Kagar

Maoist:  కేంద్ర ప్రభుత్వం చేపట్టి ‘ఆపరేషన్‌ కగార్‌’ ను వెంటనే ఆపివేయాలని ప్రొఫెసర్ జి.హరగోపాల్‌ డిమాండ్ చేశారు. ఆదివాసీలపై జరుగుతున్న దమనకాండను దేశవ్యాప్తంగా చర్చ జరగాలని చెప్పారు. ఈ మేరకు సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడుతూ.. దేశంలో అభివృద్ధి నమూనా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని విమర్శించారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని, అభివృద్ధిలో సమానత్వం లేదని మండిపడ్డారు. బస్తర్‌లో అభివృద్ధి పేరిట అణచివేత జరుగుతోంది. ఇలాంటి పరిస్థితులు సమాజాన్ని విధ్వంసం వైపు తీసుకెళ్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది కూడా చూడండి: Horoscope:నేడు ఈ రాశి వారు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి...!

Also Read :  Satellite Townships : మధ్యతరగతి ప్రజలకు గుడ్ న్యూస్... ORR సమీపంలో శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు

ఖనిజ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు..

ఇక దేశంలోని ఖనిజ నిల్వల్లో 18 శాతం ఛత్తీస్‌గఢ్‌లో ఉన్నాయని మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకుడు వి.ఎస్‌.కృష్ణ చెప్పారు. అక్కడి ఖనిజ సంపదను కార్పొరేట్‌ కంపెనీలకు కట్టబెట్టడమే మావోయిస్టుల ఏరివేత వెనుక అసలు ఉద్దేశమని అన్నారు. బూటకపు ఎన్‌కౌంటర్లు, గ్రామాలను ధ్వంసం చేయడం, అత్యాచారాలు, వ్యక్తులను మాయం చేయడం వంటి చర్యలకు పాల్పడుతూ ఉద్యమాన్ని నేరమయం చేశారని ఆరోపించారు. న్యాయవ్యవస్థ పర్యవేక్షణలో వీటిపై విచారణ జరపాలని కోరారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, పర్యావరణవేత్త గంజివరపు శ్రీనివాస్, ఆదివాసీ హక్కుల నేత రామారావు దొర తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ విధానాలపై మండిపడ్డారు. 

ఇది కూడా చూడండి: USA: వెల్కమ్ హోమ్ టూ సునీతా విలియమ్స్..సేఫ్ గా ల్యాండ్ అయిన వ్యోమగాములు

Also Read :  Telangana Budget 2025 : 27 ఎకరాల్లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి.. రూ. 2700 కోట్లు కేటాయింపు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు