Prakash district: ప్రకాశం జిల్లాలో పెను విషాదం.. ఈతకు వెళ్లి ముగ్గురు మృతి!

ప్రకాశం జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో 5మంది ఈతకు వెళ్లగా.. నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన నలుగురిలో 3 శవాలు ఒడ్డుకు కొట్టుకురాగా.. మరోకరిని స్థానికులు కాపాడారు. ఇక మిగిలిన ఒక్కరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

New Update
pakala beach

Prakash district pakala beach

Prakash district: పండగ వేళ ప్రకాశం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంక్రాంతి సెలవులు కావడంతో పొన్నలూరు మండలం తిమ్మపాలెం కు చెందిన  5మంది కుటుంబ సభ్యులు ఈ రోజు  సరదాగా ఈతకు వెళ్లారు.  అయితే  సముద్రంలోకి ఈతకు దిగిన క్రమంలో ఐదుగురిలో..  నలుగురు వ్యక్తులు గల్లంతయ్యారు.  నలుగురిలో మూడు శవాలు ఒడ్డుకు కొట్టుకురాగా.. ఒకరిని స్థానికులు చూసి కాపాడారు. మిగిలిన ఒక్కరి కోసం పోలీసు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.  ఈ దుర్ఘటన  సింగరాయకొండ మండలం పాకల బీచ్ లో జరిగింది. మృతి చెందిన వారిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నాడు. మృతులను మాధవ, జస్మిక, యామిని గా పోలీసులు గుర్తించారు.

Also Read: Sankranti 2025: మకర సంక్రాంతికి సరైన పూజ సమయాలివే.. ఆ రోజు ఈ పనులు తప్పక చేయాలి

Prakash district
Prakash district

Also Read :  సుజాత లేని గేమ్ ఛేంజర్.. ఎవరీ రంగరాజన్ .. శంకర్ పని అయిపోయనట్టేనా!

విశాఖపట్నంలో మరో విషాదం

ఇది ఇలా ఉంటే విశాఖపట్నంలో మరో విషాదం జరిగింది. సంక్రాంతి పండగ కోసం బంధువుల ఇంటికి వెళ్లిన ఓ కుటుంబానికి తీరని విషాదం మిగిలింది. అపార్ట్మెంట్ సెల్లార్ సరదాగా ఆడుకుంటున్న చిన్నారిని  కారు ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందింది.  

Also Read: పిల్లల తలపై భోగి పళ్ళు పోయడానికి కారణమేంటి.. పురాణాలలో ఈ కథ గురించి తెలుసా?

స్థానికుల వివరాల ప్రకారం.. సుజాతనగర్ కు చెందిన దంపతులు పిల్లలతో కలిసి గాజువాక పరిధిలోని  సెలస్ట్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న తమ బంధువుల ఇంటికి సంక్రాంతి పండక్కి వచ్చారు. ఈ క్రమంలో తమ పిల్లలు అపార్ట్మెంట్ లోని సెల్లార్ లో ఆడుకుంటుండగా అటు వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో వెంటనే ఆ చిన్నారిని కిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఫార్మా కంపెనీకి చెందిన ఓ ఉద్యోగి  నిర్లక్ష్యంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. 

Also Read: Daaku Maharaaj Day 1 Collections: 'డాకూ మహారాజ్' బాక్స్ ఆఫీస్ ఊచకోత.. తొలి రోజే ఎన్ని కోట్లంటే !

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు