/rtv/media/media_files/2025/04/01/ZfLDE6R3n2yG9GyifCuS.jpg)
ap rationcard
AP New RationCards: పేదలకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మే నుంచి కొత్త రేషన్‌కార్డులు మంజూరు చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలపారు. ATM కార్డు సైజులో ఉండే వీటిలో క్యూఆర్ కోడ్, ఇతర భద్రతా ఫీచర్లు ఉంటాయని చెప్పారు.
ATM కార్డు సైజులో కొత్త రేషన్ కార్డు🙏 : మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు @mnadendla pic.twitter.com/FKPNXxXmJD
— Arjilli Appalaraju (@Arjilli999ARaj) April 1, 2025
ఈ-కేవైసీ పూర్తైన తర్వాతే..
ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కార్డులో కుటుంబసభ్యులను చేర్చుకోవడంతోపాటు తొలగించేందుకు కూడా ఆప్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక ఈ-కేవైసీ పూర్తైన తర్వాతే ఎంతమందికి కార్డులు ఇవ్వాలో క్లారిటీ వస్తుందని, నేటినుంచి దీపం-2 రెండోవిడత సిలిండర్ బుకింగ్ మొదలుపెట్టినట్లు స్పష్టం చేశారు.
ఇది కూడా చూడండి: ఏపీకి వాతావరణశాఖ చల్లని కబురు.. ఈ జిల్లాల్లో వానలు..!
రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోంది. గన్నీ బ్యాగ్స్ కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. నచ్చిన మిల్లుకు తీసుకెళ్లి రైతులు ధాన్యం అమ్ముకోవచ్చు. వాట్సప్ ద్వారా కూడా ధాన్యం అమ్ముకునే అవకాశాన్ని కల్పించాం. ఇప్పటికే వాట్సప్ ద్వారా 16వేల మంది రైతులు ధాన్యాన్ని విక్రయించినట్లు వెల్లడించారు.
ఇది కూడా చూడండి: డెత్ ఓవర్ల స్పెషలిస్ట్.. రూ. 30లక్షలకు ముచ్చెమటలు పట్టించాడు!
ఇదిలా ఉంటే.. ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లను అందిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. దివ్యాంగులకు రూ.6వేల పింఛన్లు, కోటిన్నర కుటుంబాలకు 64 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామన్నారు. సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం అందిస్తున్నామని, పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి రూ.33,100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. పింఛన్ల రూపంలో నెలకు రూ.2,722 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఒక నెల తీసుకోకపోయినా 3 నెల తీసుకునే అవకాశం కల్పించాం. పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా రూ.76 కోట్లు ఇస్తున్నామని, పేదరికం లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ముఖ్యమంత్రి.
ration-cards | nadendla-manohar | cm-chandrababu | telugu-news | today telugu news
AP News: ఏపీకి మరో మూడు సార్లు అతనే సీఎం.. పవన్ సంచలన వ్యాఖ్యలు!
ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం కావాలి. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు.
Pawan sensational comments on AP CM post
AP News: ఏపీకి మరో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని డిప్యూటీ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి మూడోసారి మోదీ ప్రధాని అయ్యారు. అలాగే చంద్రబాబు కూడా వరుసగా మూడు సార్లు సీఎం కావాలి. ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు నేను సిద్ధంగా ఉన్నానన్నారు.
చంద్రబాబు నుంచి నేర్చుకోవాలి..
ఈ మేరకు చంద్రబాబు నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని -పవన్ అన్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడుతూ.. కౌరవ సభని గౌరవ సభగా మార్చి వస్తానని శపదం చేశానని, అలాగే గౌరవ సభగా మార్చి చూపించామని చెప్పారు. ఒక అర్ధవంతమైన శాసన సభలు జరిగాయి. ప్రతి ఒక్క శాసన సభ్యుడు మంచి అవగాహనతో సభలో మాట్లాడారు. అలాగే ప్రతి ఒక్క ఎమ్మెల్యే లు మళ్ళి గెలిచేలా మంచి పేరు తెచ్చుకోవాలి. దశాబ్దాల పోరాటాల తర్వాత వర్గీకరణ బిల్లు ని విజయవంతంగా శాసన సభల్లో ప్రవేశపెట్టామని ప్రభుత్వ గొప్పతనం గురించి వివరించారు.
SAAP విజయవంతం..
అలాగే ఏపీ రాజకీయ నేతల కల్చర్ ప్రోగ్రామ్ సంబందించిన బహుమతులు గెలిచిన శాసన సభ్యులకి ఇవ్వడం మంచి పరిణామం అన్నారు. ఇవ్వాళా శాసన సభ్యుల చేసిన నటనకు సీఎం చంద్రబాబు, నేను బాగా నవ్వుకున్నాం. బలమైన నాయకుడైన చంద్రబాబుకి నవ్వు కలిపించినందుకు ధన్యవాదాలు. మంచి ఆహ్లాదన్ని ఇచ్చింది. ఇంటికి వెళ్లి మరి నవ్వుకునే సందర్భాలు కలిగించాయి. రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించే నాయకత్వంతో కూటమి ప్రభుత్వం ఉంటుంది. దుర్యోదణుడిగా అలరించిన డిప్యూటీ స్పీకర్ రఘు రామరాజు కి కృతజ్ఞతలు. చిన్నప్పుడినుంచి నాకు క్రీడలు తెలియదు. మొట్టమొదటి సారి నాకు కూడా పోటిల్లో పాల్గొనాలనిపించింది. వచ్చే సంవత్సరం పోటిల్లో పాల్గొంటా. అందరికి ఒక మంచి స్ఫూర్తి ని ఇచ్చింది. SAAP విజయవంతంగా ఈ పోటీలని నిర్వహించింది. వారికీ ప్రత్యేక ధన్యవాదాలు. గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే అనేక పర్యాయలు కూటమి ప్రభుత్వం పనిచేయాలని ఆయన అన్నారు.
Also Read: Social Media X: భారత కేంద్ర ప్రభుత్వంపై ఎలాన్ మస్క్ ఎక్స్ దావా..
అలాగే ఏపీలో రాజకీయ నేతల రోజు ఎంతో ఉత్సాహంగా అయ్యన పాత్రులు కనిపిస్తున్నారన్నారు. ఎన్టీఆర్ ఏ డైలాగ్ చెప్పారో అలాగే RRR అలా నిండుగా చెప్పారని కొనియాడారు. ఎన్నడూ లేని విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేసాం. పవన్ కళ్యాన్ సినిమాల్లో కూడా ఇంత వినోదం వచ్చుండదు. వినోదంతో పాటు మంచి సందేశలతో మంచి స్కిట్లు చేసారు. ఈశ్వరరావు చేసిన పెర్ఫార్మన్స్ తో నేనెప్పుడూ నవ్వలేని విధంగా నవ్వించారని కొనియాడారు.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
( pawan-kalyan | chandra-babu | cm | telugu-news | latest-telugu-news | today telugu news)
Vivo New Mobiles: ఇదేం కిక్కు.. తొలిసారిగా భారీ బ్యాటరీతో Vivo కొత్త ఫోన్లు లాంచ్.. చూస్తే మైండ్ పోవాల్సిందే!
AP New RationCards: మంత్రి నాదెండ్ల శుభవార్త.. కొత్త రేషన్ కార్డులపై కీలక ప్రకటన!
Earthquake: పెను విషాదం.. 2700కు పెరిగిన భూకంప మృతులు
The court's sensational verdict : ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. చలించిన వస్త్ర వ్యాపారి..శిక్షపడేవరకు.....
ప్రవీణ్‌ది పక్కా ప్లానింగ్ మర్డర్.. ఇదిగో ప్రూఫ్.. వెలుగులోకి షాకింగ్ వీడియో!