/rtv/media/media_files/2025/01/29/4ph3sPUtxSIMiQkqnZX5.webp)
women Murder
Ap Crime:
హైదరాబాద్‌లోని మీర్ పేట్‌లో భార్యను ముక్కలుగా నరికి హత్య చేసిన దారుణ ఘటన ఇంకామరువక ముందే ప్రకాశం జిల్లాలో అలాంటి దారుణ విషయమే మరొకటి వెలుగులో చూసింది. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని తెలుగు వీధిలో 35 ఏళ్ల కన్న కొడుకు శ్యామ్‌ను కన్నతల్లి లక్ష్మి ఓ ఆటో డ్రైవర్ మోహన్ తో కలిసి హత్యకు పాల్పడింది. ఆ తరువాత శరీర భాగాలను ముక్కలుగా నరికి మూడు గోనెసంచుల్లో కుక్కి మేదర బజారు సమీపంలోని పంట కాలువలో పడేశారు. తర్వాత ఏమీ జరగనట్లు ప్రశాంతంగా ఉండిపోయారు.
మూడు గోనెసంచుల్లో..
అసలు ఏం జరిగిందంటే...లక్ష్మికి ముగ్గురు కొడుకులు వారిలో శ్యాంబాబు కూడా ఒకరు. అయితే మద్యానికి బానిసైన శ్యాం బాబు నిత్యం తగాదాలతో గడిపేవాడు.ఈ క్రమంలోనే శ్యాంబాబు ఊర్లో ఓ యువతిని మద్యం మత్తులో వేధింపులకు గురి చేశాడు. ఊర్లో వారు అతనికి దేహశుద్ది చేసి బుద్ధి చెప్పారు.
మద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కన్న కొడుకును హత్యచేయించిన తల్లి
— Telugu Scribe (@TeluguScribe) February 15, 2025
ప్రకాశం జిల్లాలో చెందిన సాలమ్మకు నలుగురు పిల్లలు.. మూడో వాడైన శ్యాంబాబు(35) మద్యానికి బానిసై దొంగతనాలు కూడా చేసేవాడు
కొద్దిరోజుల కిందట మద్యం మత్తులో బంధువుల అమ్మాయితోను, చివరికి తల్లితోను అసభ్యంగా… pic.twitter.com/QKLj6FjAIV
అప్పటికీ అది అయిపోయినప్పటికీ..శ్యాంబాబు మాత్రం ఏం మారలేదు. మద్యం మత్తులో తల్లితో కూడా అసభ్యంగా ప్రవర్తించాడు.అంతేకాకుండా ఆస్తి కోసం నిత్యం అన్నదమ్ములు,తల్లితో గొడవపడుతుండేవాడు.దీంతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు అతడిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలనుకున్నారు.
దీంతో ఓ ఆటో డ్రైవర్ కి సుపారి ఇచ్చి హత్య చేయించారు.అక్కడితో ఆగకుండ బాడీని ముక్కలుగా నరికి గొనేసంచుల్లో నింపి పంట కాలువలో పడేశారు. కాల్వగట్టుపై రక్తపు మరకలు చూసి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసుల విచారణలో నేరం అంగీకరించిన లక్ష్మి. దీంతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Also Read:Maha Kumbh Mela: మహా కుంభమేళాకు 50 కోట్ల మంది భక్తులు.. యూపీ సర్కార్ సంచలన ప్రకటన