🔴Live News: హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 20, 2025 12:09 IST

    ఔరంగాజేబు సమాధి వివాదంలోకి చంద్రబాబును లాగిన ఉద్ధవ్.. సంచలన వ్యాఖ్యలు!

    ఔరంగజేబు 300 ఏళ్ల క్రితం మరణిస్తే ఇప్పుడు సమాధి తవ్వాల్సిన అవసరం ఏంటని ఉద్దవ్‌ ఠాక్రే ప్రశ్నించారు. ఒకవేళ సమాధిని తొలగించాలనుకుంటే.. ఎన్డీయేలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌ను పిలవాలన్నారు.

    Uddhav Thackeray and Chandra babu naidu
    Uddhav Thackeray and Chandra babu naidu

     



  • Mar 20, 2025 12:09 IST

    హరీష్ రావుకు భారీ ఊరట...ఆ కేసు కొట్టివేసిన కోర్టు

    మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు కు హైకోర్టులో ఊరట లభించింది. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో పంజాగుట్ట పోలీసులు ఆయనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. స్థిరాస్తి వ్యాపారి చక్రధరగౌడ్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

     T. Harish Rao
    T. Harish Rao

     



  • Mar 20, 2025 12:08 IST

    నాగ్ పూర్ అల్లర్లలో దారుణం..మహిళా కానిస్టేబుల్ పై లైంగికదాడి



  • Mar 20, 2025 12:08 IST

    ఘోర ప్రమాదం.. పోలీస్ వాహనంపైకి దూసుకెళ్లిన కారు.. కానిస్టేబుల్ స్పాట్ డెడ్!

    కామారెడ్డి జిల్లా గాంధారిలో కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ రవికుమార్ అక్కడిక్కడే మృతి చెందాడు. మరో కానిస్టేబుల్ సుభాష్ కి తీవ్రగాలయ్యాయి.



  • Mar 20, 2025 12:08 IST

    మద్యం తాగేవాళ్లకి వారానికి రెండు బాటిళ్లు ఫ్రీగా ఇవ్వాలి.. ఎమ్మెల్యే డిమాండ్



  • Mar 20, 2025 12:07 IST

    బెట్టింగ్ యాప్ వివాదం.. రానా, దేవరకొండ, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మితో పాటు వారందరిపై కేసులు

    బెట్టింగ్ యాప్ కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మియాపూర్ పోలీసులు టాలీవుడ్ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. విజయ్ దేవరకొండ, ప్రకాశ్ రాజ్, మంచు లక్ష్మీ, అన్యన్య, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మీ, శ్రీముఖి తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

    Betting App case
    Betting App case Photograph: (Betting App case)

     



  • Mar 20, 2025 12:07 IST

    ప్రపంచంలో హ్యాపీ దేశాల జాబితా విడుదల.. భారత్‌ ఏ స్థానమంటే ?

    ఫిన్లాండ్‌ వరుసగా ఎనిమిదోసారి సంతోషకరమైన దేశంగా అగ్రస్థానంలో నిలిచింది. రెండోస్థానంలో డెన్మార్క్, మూడో స్థానంలో ఐస్‌లాండ్, నాలుగో స్థానంలో స్వీడన్ దేశాలు నిలిచాయి. ఇక భారత్‌కు ఈసారి 118వ ర్యాంక్ వచ్చింది.



  • Mar 20, 2025 12:06 IST

    ఐపీఎల్ కు ముందు మాల్దీవుల్లో రోహిత్ శర్మ చిల్..

    ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఉత్సాహంగా ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో మొదలవ్వ బోయే ఐపీఎల్ ముందు ఫ్యామిలీతో కలసి మాల్దీవుల్లో చిల్ అవుతున్నారు. ఖరీదైన రిసార్ట్ లో కూతురితో ఎంజాయ్ చేస్తున్నాడు. 

    rohith
    Rohith sharma with family

     



  • Mar 20, 2025 12:06 IST

    హీరో విశ్వక్ ఇంట్లో చోరీ కేసులో దొంగలు అరెస్ట్..

    హీరో విశ్వక్ సేన్ ఇంట్లో దొంగతనం చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. షేక్ పేట నాలా వద్ద దొంగిలించిన డైమండ్ రింగ్స్, ఇతర వస్తువులను విక్రయిస్తుండగా పట్టుబడ్డారు. భీమవరపు స్వరాజ్, బొల్లి కార్తీక్, నేరేడుమల్లి సందీప్ లను నిందితులుగా గుర్తించారు.

    hero vishwak sen
    hero vishwak sen

     



  • Mar 20, 2025 12:05 IST

    హెచ్‌-1బీ వీసాలో మార్పులు.. పాత రికార్డులన్నీ తొలగింపు

    అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్‌-1బీ వీసా జారీ విషయంలో కొత్త వ్యవస్థ అమలుపై దృష్టి పెట్టారు. నేటి నుంచి ఐదేళ్ల కంటే పాతవైన రికార్డులను సిస్టమ్ నుంచి తొలగించనున్నారు. పాత వీసాల రికార్డులను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలని ఆయా సంస్థలకు ఆదేశించారు.



  • Mar 20, 2025 12:05 IST

    ప్రజల్లోకి వెళ్లాలంటే....గన్‌ లెసెన్స్‌ ఇవ్వండి...పోలీసులకు ఆ ఎమ్మెల్యే లేటర్‌..

    గోషామహల్‌ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ కు ఇవాళ ఉదయం మంగళ్‌హాట్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గత నెల రోజులుగా చంపేస్తామంటూ ఆయనకు ఆగంతకుల నుంచి వరుసగా బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయి. భద్రతా కారణాల వల్ల తనకు గన్ లైసెన్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోరారు.

     BJP MLA Raja Singh
    BJP MLA Raja Singh

     



  • Mar 20, 2025 12:04 IST

    తిరుమలకు ఏపీ సీఎం కుటుంబం..అన్నప్రసాదం వడ్డన

    మార్చి 21న ఏపీ సీఎం చంద్రబాబు మనుమడు దేవాన్స్ పుట్టినరోజు. దీనిని పురస్కరించుకుని చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ మొత్తం తిరుమలకు వెళ్ళనున్నారు. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అక్కడి భక్తులకు స్వయంగా అన్నప్రసాదాల్ని వడ్డించనున్నారు. 

    ap
    CM Chandra Babu Family

     



  • Mar 20, 2025 12:04 IST

    ఎక్స్‌ఏఐ చాట్‌బాట్‌ బూతులు.. కేంద్రం కీలక నిర్ణయం



  • Mar 20, 2025 12:03 IST

    వినియోగదారులకు అలర్ట్....నాలుగు రోజులు బ్యాంక్ లు బంద్



  • Mar 20, 2025 12:03 IST

    ఈసారి ఐపీఎల్ లో ఊపు మీదున్న బ్యాటర్లు..పెద్ద స్కోర్లు గ్యారంటీ



  • Mar 20, 2025 12:03 IST

    సీఎం రేవంత్‌కు జంపింగ్ ఎమ్మెల్యేల షాక్... అంతా తూచ్...మేం పార్టీ మారలేదు



  • Mar 20, 2025 12:02 IST

    హిజ్రాతో సహాజీవనం...మరదలితో ప్రేమాయణం...చివరికి ఏం చేశాడంటే..

    అనకాపల్లి జిల్లాలో వెలుగుచూసిన హత్యకేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. కాగా మృతదేహం దిలీప్ అలియాస్ దీపు అనే హిజ్రాదిగా తేలింది. దీపు తల, మొండం వేరు చేసి. కాళ్లు, చేతుల్ని ముక్కలుగా నరికి హత్య. దీపుని ఆమె లవర్ బన్నీ అతి కిరాతకంగా హత్య చేసినట్లు గుర్తింపు.

    Lover killed hijra
    Lover killed hijra

     



  • Mar 20, 2025 12:01 IST

    అప్పుడు అండర్ 19 ఫైనల్లో హీరో.. ఇప్పుడు ఐపీఎల్లో అంపైర్‌

    మార్చి 22 వ తేదీ నుంచి ప్రారంభం కాబోయే ఐపీఎల్ సీజన్ 18కి తన్మయ్ శ్రీవాత్సవా అంపైర్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. విరాట్ కోహ్లీతో అండర్ 19లో తన్మయ్ రాణించాడు. ఇండియా ఫైనల్ మ్యాచ్‌లో కీలకపాత్ర పోషించాడు.



  • Mar 20, 2025 12:01 IST

    త్వరలో టోల్‌ ట్యాక్స్‌లో కొత్త విధానం.. కేంద్రమంత్రి నితీన్ గడ్కరీ



  • Mar 20, 2025 12:01 IST

    చిరంజీవికి లైఫ్ ఎచీవ్ మెంట్..యూకే పార్లమెంట్లో ఘన సత్కారం

    మెగస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. యూకే పార్లమెంట్ లో ఘన సత్కారం జరిగింది. దాంతో పాటూ ఆయనకు లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డును అందించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

    cinema
    Mega Star Chiranjeevi

     



  • Mar 20, 2025 12:00 IST

    12 ఏళ్ల క్రితమే సునీతపై పాఠం..ఎక్కడో తెలుసా?

    అంతరిక్షయానం సవాళ్లతో కూడుకున్నదైనప్పటికీ ఈసారి మాత్రం సాంకేతిక సమస్య కారణంగా సునీతా విలియమ్స్‌ సుదీర్ఘ కాలం అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ పరిణామాలు యావత్‌ ప్రపంచాన్నిఉద్వేగానికి గురిచేశాయి. 8 రోజుల్లో పూర్తికావాల్సిన ఆమె జర్నీకి ఏకంగా 9నెలలు పట్టింది.

    Sunita Williams
    Sunita Williams

     



  • Mar 20, 2025 12:00 IST

    ఆగని బంగారం.. నేటి ధరలు ఎలా ఉన్నాయంటే?

    బంగార ధరలు నేడు మార్కెట్‌లో కాస్త పెరిగాయి. 24 క్యారెట్ల 10  గ్రాముల బంగారం ధర రూ.88,660 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.81,272 గా ఉంది. వెండి కూడా కేజీ రూ.1,00,120 ఉంది. అయితే ప్రాంతాన్ని బట్టి వీటి ధరల్లో కాస్త మార్పులు ఉంటాయి.



  • Mar 20, 2025 11:59 IST

    జాన్ ఎఫ్‌ కెన్నడీ హత్య వెనుక సీఐఏ హస్తం



  • Mar 20, 2025 11:59 IST

    రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా సోమనాథ్, సుచిత్ర ఎల్ల, సతీష్ రెడ్డి..



  • Mar 20, 2025 11:59 IST

    అరుణాచలంలో దారుణం.. విదేశీ మహిళపై గైడ్ అత్యాచారం



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు