/rtv/media/media_files/2026/04/16/kurnool-accident-2026-04-16-06-28-40.jpg)
దైవదర్శణానికి వెళ్తున్న భక్తుల జీవితాల్లో రోడ్డు ప్రమాదం(road accident) తీరని చీకట్లను నింపింది. కర్నూలు జిల్లా(Kurnool Road Ac*cident) మంత్రాలయం మండలం చిలకలడోన సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. కర్ణాటక రాష్ట్రం చిక్కమగళూరు జిల్లాకు చెందిన సుమారు 20 మందికి పైగా భక్తులు ఓ బొలెరో వాహనంలో మంత్రాలయం(mantralayam) లోని శ్రీ రాఘవేంద్రస్వామిని దర్శించుకోవడానికి బయలుదేరారు. చిలకలడోన గ్రామ సమీపానికి చేరుకోగానే, ఎదురుగా వస్తున్న కాంక్రీట్ మిక్స్ లారీ భక్తుల వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బొలెరో వాహనం నుజ్జునుజ్జయింది. వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మిగిలిన వారు తీవ్ర గాయాలతో హాహాకారాలు చేశారు.
Also Read : విశాఖలో దారుణం... బర్త్ డే పార్టీలో యువతి అనుమానస్పద మృతి
Mantralayam Road Accident
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను వాహనం నుండి బయటకు తీసి, అత్యవసర చికిత్స నిమిత్తం ఎమ్మిగనూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రాఘవేంద్రస్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుందామని బయలుదేరిన భక్తులు, గమ్యస్థానానికి చేరకముందే అనంత లోకాలకు వెళ్లడం ఆ కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also Read : ముదురుతున్న విష్ణుప్రియ వివాదం... ఈజీ మనీ కోసం గలీజ్ దందా
Follow Us