/rtv/media/media_files/2025/02/08/A5k3HRMa31Mnxw1BGC1v.jpg)
KP Paul sensational allegations on Delhi elections and ap politics
ఢిల్లీ ఎన్నికలపై (Delhi Elections 2025) కేఏపాల్ (KA Paul) సంచలన ఆరోపణలు చేశారు. దేశ రాజధానిలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా ఫెయిల్ అయిందన్నారు. ఎన్నికలు జరిగిన రోజే ఫలితాలు రావాలని, లేకపోతే ఇక ఈ దేశానికి భవిష్యత్తు లేదంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. అంతేకాదు టాప్ 10 పొలిటికల్ పార్టీస్ మోదీ ముందు లింగిపోయాయని ఆరోపించారు. ఈ మేరకు శనివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన పాల్.. తెలుగు రాష్ట్రాలే దేశానికి దిక్కు అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే చాలామంది జైలుకి వెళ్తారని తనకు ముందే తెలుసన్నారు. వారం క్రితం కేజ్రీవాల్ ఇంట్లోనే జరగబోయే ఈ వాస్తవాలు ఆయనకు చెప్పానని, కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, జైన్ ను జైల్లో పెడతారని వారం క్రితమే నిక్కచ్చిగా చెప్పానని గుర్తు చేశారు.
Also Read : జాతీయ నదీ పునర్జీవం పథకంలో మూసీ..ఎంపీ అనిల్ కుమార్ డిమాండ్
సిస్టం గతి తిప్పుతోంది..
ఏసీ సీఎం చంద్రబాబు (Chandrababu) చనిపోయిన తరువాత నీకు నిత్య నరకం తప్పదు. 76 ఏళ్ల వయసులో నీకెందుకు ఈ రాజకీయాలు. నాకు మద్దతిస్తే నేను ఆట మొదలెడతా. మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అయిన చంద్రబాబు కూడా ఇప్పుడు మోదీ పాట పాడుతున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు బ్యాలెట్ పేపర్ లో జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ దేశంలో ఫోర్ పిల్లర్స్ స్ట్రాంగ్‌గా లేకపోతే సిస్టం గతి తిప్పుతోంది. దేశ భవిష్యత్తు పూర్తిగా సందిగ్ధంలో ఉంది. ట్రంప్ తో యుద్ధం చేసి అయినా మన తెలుగువాళ్ళను కాపాడుకుంటా అన్నారు.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal: ఆప్ ఓటమి.. కేజ్రీవాల్ ఎదుర్కోబోయే సవాళ్లు ఇవే
ఇక తాను రాజ్యసభ అవకాశం కోసం ఎదురుచూస్తున్నట్ల చెప్పారు. ఈ దేశానికి సేవ చేద్దామని మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలెవ్వరు కోరుకోవడం లేదు. మోదీ ఇచ్చిన 10 వాగ్దానాలు అమలు కాలేదు. అమెరికా దేశం మన భారతీయులకు కాళ్లకు సంకెళ్లు, చేతులు కట్టేసి, ముఖాలను మూసి తరలిస్తున్నారు. జగన్ నువ్వు మోదీకి సరెండ్ అవ్వోద్దు. డిప్రెషన్‌తో బెంగళూరుకు పారిపోయిన జగన్‌కు నేను మనో ధైర్యం ఇచ్చా. ప్రాణం పెట్టి పోరాడు అని చెప్పా. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చినా అప్పులు పెరగడం తప్ప ప్రయోజనం లేదు. విజయసాయిరెడ్డి, షర్మిలను నమ్మిన జగన్మోహన్ రెడ్డిని వాళ్లే ముంచేశారు. పవన్‌కు తెలుగు సినిమాలు లేకపోతే హాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తామన్నారు.
Also Read : ప్రాణం తీసిన ఈత సరదా...బతుకు తెరువుకోసం వచ్చి...