/rtv/media/media_files/2024/10/22/u5HRAnrHsty3gHFaBRxX.jpg)
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎండల నుంచి రిలీఫ్ ఇస్తూ విపత్తు నిర్వహణశాఖ చల్లని కబురు చెప్పింది. ఇవాళ సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో చెదురుమదురుగా.. గురువారం రాయలసీమ, అల్లూరి జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పింది. శుక్రవారం ఉత్తరాంధ్రలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు.. కర్నూలు, అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు.
Also Read: Musk: 13వ సంతానంపై మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఆ బిడ్డకు తండ్రి నేను కాదేమో!
అకాల వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.శనివారం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు.
Also Read: Kashmir: ఇండియా, పాక్ బోర్డర్ లో మళ్ళీ టెన్షన్..ఆర్మీ చేతికి చిక్కిన చొరబాటుదారులు
గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడవచ్చని భావిస్తుననారు. శుక్రవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. దీనిపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందంటున్నారు.ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో-6, విజయనగరం జిల్లాలో-5, పార్వతీపురంమన్యం జిల్లాలో-11, అల్లూరి సీతారామరాజు జిల్లాలో-5, కాకినాడ జిల్లాలో-1, తూర్పుగోదావరి జిల్లాలో-2 మండలాల్లో కలిపి మొత్తం 30 వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
గురువారం 47 మండలాల్లో వడగాలులు వీచేందుకు అవకాశం ఉందన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో వాతావరణం కాస్త మారింది..రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలులు తగ్గుముఖం పట్టాయి.మరోవైపు తెలంగాణలో కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
ఏప్రిల్ 1 తేదీ నుంచి మూడో తేదీ వరకు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 4, 5న వర్ష ప్రభావం తక్కువగా ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ఉరుములు, మెరపులతో కూడిన వడగండ్ల వర్షం కురుస్తుందని..గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంటున్నారు.
Also Read: Zomato: జొమాటోలో పెద్ద ఎత్తున లేఆఫ్స్...వందల మంది తొలగింపు
ap | chittor | ananthapur | srikakulam | latest-news | telugu-news | latest telugu news updates | latest-telugu-news