Ap Rains: ఏపీ ప్రజలకు చల్లని వార్త..ఈ వారం అంతా వానలే వానలు..!

ఏపీ వాతావరణ శాఖ చల్ల చల్లని వార్త వినిపించింది.సోమవారం దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

New Update
Rains

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గరిష్ఠ స్థాయిలు చేరుకున్నాయి. భానుడు నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. బయటికొస్తే ఎండ.. లోపలుంటే ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితిలో వాతావరణ శాఖ చల్ల చల్లని కూల్ కూల్ వార్త వినిపించింది. ఈ వారంలో ఏపీలోని ఆ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అనుకుంటుంది.

Also Read: CM MK Stalin: స్టాలిన్ ఉగాది పోస్టు వివాదం.. మేము ద్రవిడులం కాదంటున్న కన్నడ వాసులు..

సోమవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా మంగళవారం ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశలున్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ తర్వాత కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా తక్కువ ఎత్తులో గాలులు వీస్తుండటంతో ఈ పరిస్థితి ఏర్పడినట్టు తెలిపింది.

Also Read: Trump: అమెరికా అధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు..మూడోసారి కూడా నేనే..!

సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజుల్లో వేడి, తేమతో కూడిన వాతావరణం అసౌకర్యంగా ఉంటుందని.. ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయిలోనే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండకపోవచ్చని తెలిపింది.

మంగళవారం  ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులు కూడా వచ్చే అవకాశాలున్నాయి. గంటకు 30-40 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. దీని తరువాత ఉష్ణోగ్రతలు కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. అయినప్పటికీ సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

భారత వాతావరణ శాఖ ఏప్రిల్ 3 తర్వాత కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. అలాగే ఈదురు గాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. ఏప్రిల్ 3 తర్వాత కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని… ఈదురుగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ వాతావరణ సూచన జారీ చేసింది.

ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ, నైరుతి గాలులు వీస్తున్నాయి. దీని కారణంగా వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాం మీదుగా తక్కువ ఎత్తులో ఆగ్నేయ, నైరుతి గాలులు వీయటం వల్ల వాతావరణ పరిస్థితులు ప్రభావితమవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షాల సమయంలో సురక్షితంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వేడి, తేమ ఎక్కువగా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచిస్తున్నారు.

Also Read: BIG BREAKING: ఏపీలో రేపు సెలవు

Also Read: America-Iran: అటు ట్రంప్‌ హెచ్చరికలు..ఇటు క్షిపణులతో ఇరాన్‌...!

rains | east-godavari | imd | imd alert | imd-issued-heavy-rain-alert-in-ap | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weather Alert: తెలుగు రాష్ట్రాలకు అలెర్ట్.. 5 రోజులపాటు భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలో రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయన్నారు.

New Update

ఏపీ, తెలంగాణలో  రానున్న 5 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అండమాన్ సమీపంలోని ఆవర్తనం వల్ల పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలతో పాటు పిడుగులు కూడా పడతాయని హెచ్చరించారు. అలాగే మరికొన్ని జిల్లాల్లో ఎండలు కూడా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. 

Also Read: అగ్నివీరులకు గుడ్‌న్యూస్‌.. పోలీస్ నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్లు

కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందన్నారు. సోమవారం పలు ప్రాంతాల్లో పిడుగులు పడతాయని.. వర్షాలు పడే సమయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి సమయంలో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముఖ్యంగా రైతులు చెట్ల కింద నిల్చోవద్దని చెప్పారు. 

Also Read: డీఎంకే ప్రభుత్వంపై మోదీ ఫైర్.. వాళ్లు తమిళంలో సంతకం చేయాలన్న ప్రధాని

ఇదిలాఉండగా ఇప్పటికే అనకాపల్లి, శ్రీకాకుళం, కాకినడా, పల్నాడు, బాపట్ల, గుంటూరు తదితర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసినట్లు అధికారులు చెప్పారు. ఏపీలో అత్యధికంగా కాకినాడ జిల్లా వేలంకలో 56.25 మిల్లీ మీటర్ల వాన పడినట్లు పేర్కొన్నారు.

Also Read: మణిపూర్‌లో ఉగ్రవాదులు అరెస్ట్.. భారీగా ఆయుధాలు స్వాధీనం

  telugu-news | rtv-news | rains | heavy-rains 

Advertisment
Advertisment
Advertisment