ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: సీఎం రేవంత్‌కు షాకిచ్చిన సీఎం చంద్రబాబు AP: సీఎం రేవంత్ రెడ్డికి చంద్రబాబు షాకిచ్చారు. 2 రాష్ట్రాల సమస్యలపై ఏపీ, తెలంగాణ ఎంపీలు కేంద్రం వద్దకు వెళ్తే బాగుంటుందని సీఎం రేవంత్ ప్రతిపాదించగా.. దానికి చంద్రబాబు నిరాకరించారు. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉన్నందున రాజకీయంగా అది సాధ్యం కాదని బదులిచ్చారు. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ EX CM Jagan: జగన్ సంచలన నిర్ణయం.. ఆ నియోజకవర్గాల ఇంఛార్జుల మార్పు! AP: వైసీపీ నియోజకవర్గాల ఇంఛార్జిలను మార్చే ఆలోచనలో జగన్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలో మాజీ మంత్రి జోగి రమేష్‌ను సొంత సెగ్మెంట్ మైలవరానికి మార్చినట్లు తెలుస్తోంది. కమ్మ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ దేవభక్తుని చక్రవర్తిని పెనమలూరు ఇంఛార్జిగా నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Revanth Reddy: చంద్రబాబు ముందు సీఎం రేవంత్ పెట్టె డిమాండ్స్.. ఇవే! TG: సీఎం రేవంత్‌తో ఏపీ సీఎం చంద్రబాబు ఈరోజు భేటీ కానున్నారు. విభజన సమస్యలపై చర్చించనున్నారు. ఏపీలో కలిపిన 7 మండలాలు వెనక్కి ఇవ్వాలని, విద్యుత్ బకాయిలు చెల్లించాలని, తిరుపతి దేవస్థానంలో భాగం కావాలని వంటి డిమాండ్స్‌ను రేవంత్ చంద్రబాబు ముందు ఉంచనున్నారు. By V.J Reddy 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: నాయకుడు - ప్రతినాయకుడు.. నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్..! ఏపీ మంత్రి నారా లోకేశ్ నాయకుడు-ప్రతినాయకుడు అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు. నాయకుడి తొలి ఢిల్లీ పర్యటన అంటూ చంద్రబాబు ఢిల్లీ టూర్ ను ప్రస్తావించిన నారా లోకేశ్... ప్రతి నాయకుడి తొలి జిల్లా పర్యటన అంటూ పిన్నెల్లిని జగన్ పరామర్శించడాన్ని ఎత్తిచూపారు. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: వివాదంపై కలెక్టర్ సమావేశం.. స్వామిని అనుమతించని అధికారులు.! గుంటూరు జిల్లా రాయపూడి హోసన్నా ప్రార్థనా మందిరం వివాదంపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సమావేశం నిర్వహించారు. తుళ్ళూరు MPDO కార్యాలయంలో రాయపూడి గ్రామస్తులతో సమావేశం అయ్యారు. అక్కడికి చేరుకున్న శివ స్వామిని అధికారులు లోపలికి అనుమతించలేదు. By Jyoshna Sappogula 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : పోలవరం, అమరావతికి ఆర్థిక సాయం అందించండి : చంద్రబాబు AP: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు ఈరోజు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతో సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక అవసరాలపై నిర్మలకు మెమోరాండం అందించారు. పోలవరం, అమరావతికి ఆర్థిక సాయం అందించాలని కోరారు. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ జగన్ ను కలిసిన ముద్రగడ ఏపీ మాజీ సీఎం, వైసీపీ మాజీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌ను ఆ పార్టీ నేతలు ముద్రగడ పద్మనాభం, కాసు మహేష్ రెడ్డి తదితరులు ఈ రోజు తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీసులో కలిశారు. ఎన్నికల అనంతర పరిణామాలతో పాటు పలు రాజకీయ అంశాలను చర్చించారు. By Nikhil 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Pensions: చంద్రబాబు సర్కార్‌కు దొంగ పెన్షనర్లు షాక్ ఏపీలో భారీగా బోగస్ పెన్షన్లు గుర్తించారు. ఇప్పటి వరకు రెండున్నర లక్షల బోగస్ పెన్షన్లు పంపిణీ జరిగినట్లు అధికారులు తెలిపారు. పెన్షన్లలో అక్రమాలపై సీఎం చంద్రబాబు విచారణకు ఆదేశించారు. అర్హత లేకున్నా కొందరు పెన్షన్లను పొందుతున్నారని ఫిర్యాదు రావడంతో సీఎం సీరియస్ గా తీసుకున్నారు. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu: తెలంగాణ టీడీపీ కీలక నిర్ణయం.. ఈ నెల 7న సీఎం చంద్రబాబుకు సన్మానం TG: సీఎం చంద్రబాబు ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్ లో కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేతకు ఘనసన్మానం చేయాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి నాయకులు ఎన్టీఆర్ భవనకు తరలిరావాలని పిలుపునిచ్చింది. By V.J Reddy 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn