పవన్ స్కెచ్.. జగన్‌కు షాక్!

AP: వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేనలో చేరారు. ఆమెకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్. ఆమె వెంట గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు జనసేనలో చేరారు.

New Update
PAVAN

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జనసేనలో (Janasena) చేరికల పర్వం కొనసాగుతోంది. మరోవైపు అధికారం కోల్పోయిన వైసీపీలో (YCP) నేతల రాజీనామాల ప్రవం కొనసాగుతోంది. తాజాగా జగన్ కు (YS Jagan) మరో షాక్ తగిలింది కాపు నేత, వైసీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి జనసేనలో చేరారు. పవన కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు, వారికి పార్టీకి కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్.

ఇది కూడా చదవండి:ఏపీకి అలర్ట్.. మరో అల్పపీడనంతో భారీ వర్షాలు 

ఇది కూడా చదవండి:  ఐదేళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు గ్యాంగ్ రేప్!

గుంటూరు నేతలు సైతం..

మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పద్మనాభం కుమార్తె క్రాంతి వెంట గుంటూరు నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, జగ్గయ్యపేట పురపాలక కౌన్సిలర్లు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తదితరులు పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీ మారారు. కాగా చేరికలపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో నేతలు జనసేనలో చేరాలనుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. క్షేత్రస్థాయిలో జనసేనను బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. కలుషిత తాగునీటి సమస్యను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తన దృష్టికి తీసుకొచ్చారని, పరిష్కారానికి మొదటి విడతలో రూ.91 లక్షలతో ఫిల్టర్‌బెడ్లు, ఇతర పనులు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు.

ఇది కూడా చదవండి:తెలంగాణలో రేపటి నుంచి గ్రూప్-1 మెయిన్స్

Advertisment
Advertisment
తాజా కథనాలు