/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/FotoJet-1-1-jpg.webp)
Sajjala Ramakrishna : వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నిన్న నోటీసులు జారీ చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలంటూ అందులో పేర్కొన్నారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు మంగళగిరి గ్రామీణ పోలీసు స్టేషన్‌కు రావాలని నోటీసులో తెలిపారు. దీంతో సజ్జలకు అరెస్టు భయం పట్టుకున్నట్లు తెలుస్తోంది. విచారణకు హాజరు కాకుండా తప్పించుకునేందుకు మార్గాలు వెతుకుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి భట్టి విక్రమార్క.. అధిష్టానంతో కీలక భేటీ!
గత వైసీపీ ప్రభుత్వంలో 2021 అక్టోబర్ 19న ఆ పార్టీకి చెందిన కొందరు టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశా. కాగా దీనిపై తాజాగా కేసు నమోదు కావడంతో ఇప్పటికే లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాశ్, తలశిల రఘురాంను ఫలు దఫాలుగా పోలీసులు ప్రశ్నించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌తోపాటు కొందరిని అరెస్టు చేశారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా దాడి కుట్రలో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉన్నట్లు గుర్తించారు.
ఇది కూడా చదవండి: జగన్‌కు బిగ్ షాక్.. జనసేనలోకి వైసీపీ ఎమ్మెల్యేలు!
కాగా ఈ కేసులో అరెస్టు భయంతో ఉన్న సజ్జల ఇప్పటికే కోర్టు నుంచి రక్షణ ఆదేశాలు తెచ్చుకున్నారు. కానీ ఉత్తర్వులు విచారణకు అవరోధం కాదని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సజ్జల విదేశాలకు వెళ్లకుండా ఇప్పటికే లుక్ ఔట్ నోటీసులు కూడా జారీ చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ముంబయి విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు సజ్జలను అడ్డుకోవడంతో లుక్ ఔట్ నోటీసుల అంశంపై వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: నేడు హర్యానాకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్
ఇప్పటికే సగానికిపైగా విచారణ పూర్తి..
ఇదిలా ఉంటే ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసును దర్యాప్తును సీఐడీకి అప్పగించింది. ఈ కేసులో ఇప్పటికే సగానికి పైగా విచారణ పూర్తి అయిందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సీఐడీ అధికారులు మంగళగిరి పోలీసులతో కలిసి తదుపరి విచారణను ముందుకు తీసుకెళ్లనున్నారు. అయితే ఈ కేేసులో సజ్జల 120వ నిందితుడిగా ఉన్నారని పోలీసులు చెప్పారు. నిందితుల జాబితాలో కొన్ని పేర్లు పునరావృత్తం అయ్యాయని... వారిలో అసలు నిందితులను నిర్ధారించుకున్న తర్వాత మిగిలిన వారి పేర్లు తొలగిస్తామని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ.. పోలీసుల అదుపులో అగ్రనేత సుజాత?
MLC kavitha: పవన్ అనుకోకుండా డిప్యూటీ సీఎం... ఎమ్మెల్సీ కవిత సంచలనం!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ వ్యాఖ్యలపై స్పందనేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు.
kavitha-pawan
MLC kavitha: జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనుకోకుండా డిప్యూటీ సీఎం అయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదని, ప్రజలు హిందీ నేర్చుకోవాలన్న పవన్ వ్యాఖ్యలపై స్పందనేంటని యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు. దురదృష్టవశాత్తూ పవన్ కల్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారని..చేగువేరా ఆదర్శాలు నచ్చిన వ్యక్తి ఇప్పుడు రైటిస్ట్ (బీజేపీ మద్దతుదారు) ఎలా అయ్యారని కవిత ప్రశ్నించారు.
Also Read: డ్రాగన్ వచ్చేది అప్పుడే..! రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న NTR 31..
పార్టీ పెట్టిన 15 ఏళ్లకు పవన్ ఎమ్మెల్యే అయ్యారని.. వైసీపీ మినహా దాదాపు ఏపీలోని అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నారు. అలాంటి వ్యక్తి డిప్యూటీ సీఎం కావడం ఏపీ ప్రజల దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. పవన్ కల్యాణ్ చేసే ప్రకటనలు ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయన్న కవిత... రేపు తమిళనాడు వెళ్లి హిందీ ఇంపోజ్ చేయబోమనైనా ఆయన చెప్పొచ్చు అని ఎద్దేవా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: Ram Charan Peddi AI Video: ఏం క్రియేటివిటీ రా బాబు..! వైరల్ అవుతున్న రామ్ చరణ్ AI వీడియో
పవన్ కల్యాణ్ అభిమానులు ఫైర్!
అయితే కవిత కామెంట్స్ పై జనసేన నేతలు, పవన్ కల్యాణ్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఊతికారేస్తున్నారు. కవితకు ఏ అర్హత ఉందని పవన్ కల్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. గతంలో లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టైన విషయాన్ని గుర్తుచేస్తూ ఇలాంటి స్కామ్ లు చేస్తేనే సీరియస్ పొలిటీషియన్ అన్నట్లా అంటూ కౌంటర్ ఇస్తున్నారు.
Also Read: కాంగ్రెస్ అంతరించిపోతున్న జాతి.. రేవంత్కు బండి సంజయ్ కౌంటర్
Also Read: Allu Arjun - Pavan Kalyan Son: సింగపూర్‌కు అల్లు అర్జున్.. పవన్ కొడుకు కోసం పయణం!
Vishwambhara: విశ్వంభర ఫస్ట్ సాంగ్ దింపుతున్నారు.. గెట్ రెడీ!
Madya Pradesh: ఊళ్ళో నీటి కరువుతో భర్తను వదిలేసిన భార్య!
చెప్పిన మాట వినలేదని.. కన్న కూతురిని గొంతు గోసి.. దారుణానికి ఒడిగట్టిన తల్లి?
🔴Live News Updates: పాత వాహనాలకూ కొత్త రిజిస్ట్రేషన్ నంబర్లు
జైలులోని 15 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్