/rtv/media/media_files/2025/01/25/pUHNMbHkdWtqtHSomdCb.jpg)
CM Chandra babu Naidu
విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటు గేమ్ ఛేంజర్‌గా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. అనకాపల్లి వద్ద 1.35లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్ రాబోతుందని వెల్లడించారు. దావోస్ పర్యటన ముగిసిన అనంతరం ఏపీకి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల గురించి వివరించారు. '' 1997 నుంచి దావోస్‌కు వెళ్తున్నాను. ధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ను మళ్లీ చేస్తున్నాను. రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నిలపడమే మా లక్ష్యం. మనం ఉద్యోగం అడగడం కాదు. ఉద్యోగాలు ఇచ్చే స్థితికి చేరుకోవాలి. ఇప్పుడందరూ ఐటీ అంటే హెటెక్ సిటీ పేరు చెబుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తీసుకొచ్చాను.
Also Read: మహా కుంభమేళా యాత్రికులపై రాళ్ల దాడి.. ఉద్దేశపూర్వంగా చేశారా?
తెలగువాళ్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్నారు. మనం తయారు చేసిన వస్తువులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. MSMEలు సృష్టిస్తే చాలామందికి ఉపాధి దొరుకుతుంది. భారత్‌కు మంచి భవిష్యత్తు ఉంది. 2028 నుంచి జీడీపీ వృద్ధి రేటులో మనం చైనాను దాటుతాం. ఇక సుదీర్ఘకాలం జీడీపీ వృద్ధి రేటులో మనం దేశం అగ్రస్థానంలో ఉండనుంది. బీపీసీఎల్ కంపెనీ రామాయపట్నంలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ కంపెనీ రూ.95 వేల కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది.
అనకాపల్లి వద్ద 1.35 లక్షల కోట్లతో స్టీల్‌ప్లాంట్ రానుంది. ఎన్టీపీసీ.. రూ.1.87 లక్షల కోట్లతో గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయబోతుంది. కాకినాడ నుంచి మనం గ్రీన్ అమ్మోనియాను ఎగుమతి చేయనున్నాం. ఏపీలో ఇప్పుడు 10 పోర్టులు ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా వాడుకోలేకపోతున్నాం. మన వనరులను, ఉత్పత్తిని ఇతర ప్రాంతాలకు సరిగా పంపించలేకపోతున్నాం. ప్రస్తుతం కొన్ని చిన్నదేశాలు కూడా పోర్టుల ద్వారానే తమ ఉత్పత్తిని ఎగుమతి చేస్తున్నాయి.
ప్రస్తుతం వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్రీన్ ఎనర్జీని ప్రోత్సహిస్తోంది. అమరావతితో సహా రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీకి ఉన్న అవకాశాలను దావోస్‌లో చెప్పాం. మరికొన్ని రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు స్వర్ణయుగం రానుంది. విశాఖలో గూగల్ సంస్థ ఏర్పాటు గేమ్ ఛేంజర్ కాబోతుంది. టీసీఎస్ కంపెనీ సైతం యూనిట్ ఏర్పాటు చేస్తోంది. అలాగే భవిష్యత్తులో ఏపీకి పర్యాటక రంగం కీలక పాత్ర పోషించనుంది.
Also Read: వారంతా సేఫ్.. కాంకేర్ ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టుల సంచలన లేఖ!
మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్‌గేట్స్‌ను తమ లక్ష్య ఛేదనలో భాగస్వాములు కావాలని కోరాం. అలాగే మిలిందా గేట్స్ ఫౌండేషన్ సహకరానికి కూడా విజ్ఞప్తి చేశాం. పెట్టుబడుల కోసం ఎకో సిస్టమ్‌ను రూపొందిస్తున్నాం. మన వాళ్లు ఉద్యోగాలు చేయడమే కాదు ఉద్యోగాలిచ్చే స్థాయికి వెళ్లేలా కృషి చేస్తున్నాం. 2047 వచ్చే సరికి తెలుగు వాళ్లు అత్యంత ప్రభావిత వ్యక్తులుగా ఉండనున్నారు. ఏపీ ప్రపంచానికి అన్ని సేవలు ఇవ్వగలిగే స్థాయికి చేరుకోబోతుంది.
దావోస్‌లో తాము చేసుకున్న ఒప్పందాలపై పలువురు దుష్ర్పచారం చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు, వివిధ దేశాల ప్రతినిధుల సమావేశానికి దావోస్ ఒక మంచి వేదిక. ఈ సదస్సు జరిగే మూడు రోజుల్లో అందరీని ఒకే చోట కలిసే ఛాన్స్ దక్కుతుంది. ఈసారి జరిగిన దావోస్ సదస్సులో గ్రీన్ ఎనర్జీ- గ్రీన్ హెడ్రోజన్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కీలకంగా మారినట్లు'' చంద్రబాబు వివరించారు.