/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Nara-Lokesh-met-the-Governor-at-Raj-Bhavan.-Complaint-about-ganja-jpg.webp)
Nara-Lokesh
ఏపీ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అదిరిపోయే వార్త చెప్పారు. గత ప్రభుత్వంలోని పెండింగ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలనూ విడుదల చేస్తామన్నారు. అంతేకాకుండా ఇక సెమిస్టర్ వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్ సొమ్మును కాలేజీల బ్యాంక్ అకౌంట్‌లలో జమ చేయనున్నట్లు వివరించారు.
రాష్ట్రం ఆర్థికంగా కుదుటపడ్డాక గత ప్రభుత్వ హయాంలో రూ.4వేల కోట్ల బకాయిల్ని విడతల వారీగా చెల్లిస్తామని చెప్పారు. మంత్రి లోకేష్ తిరుపతిలోని శ్రీపద్మావతి మహిళా యూనివర్శిటీలో పర్యటించారు. అక్కడ రూ.7.5 కోట్లతో నిర్మించిన ఖేలో ఇండియా మల్టీపర్పస్ ఇండోర్ మైదానం, ఏరోబిక్స్, తైక్వాండో, యోగా సెంటర్‌ను ప్రారంభించారు. అక్కడ ఇండోర్ గ్రౌండ్‌లో మంత్రి లోకేష్ సరదాగా షటిల్ ఆడారు.
Also Read: Horoscope Today: ఈ రోజు ఈ రాశి వారు ప్రయాణాలు వాయిదా వేసుకుంటే బెటర్!
మంత్రి లోకేష్ పద్మావతి ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థినులతో సమావేశం అయ్యారు. యువత పరిశోధనలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలన్నారు. పద్మావతి మహిళా యూనివర్శిటీ అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కేలా ఇక్కడి విద్యార్థినులు కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు రాణించేలా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో యూనివర్సిటీల విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తామన్నారు.
మెరుగైన ఉద్యోగావకాశాలు...
ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ విద్యను కూడా సమాంతరంగా అభివృద్ధి చేసి మెరుగైన ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. రేణిగుంట, కడపల్లో ఎలక్ట్రానిక్ క్లస్టర్లు ఏర్పాటు చేశామని.. కొత్త పరిశ్రమలు తీసుకొచ్చే పనిలో ఉన్నామన్నారు. విద్యా వ్యవస్థలో సంస్కరణల కోసం చంద్రబాబుతో పోరాడుతున్నాను అన్నారు.
మరోవైపు మంత్రి నారా లోకేష్ మంగళంలోని ఆశా కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన ఐటీసీ ఎక్స్-2025 సదస్సుకు హాజరయ్యారు. మూడురోజులపాటు ఆలయాల నిర్వహణ, ఆర్థిక వనరుల కూర్పు, పరిపాలన, క్యూ లైన్ల నిర్వహణ వంటి ప్రధాన అంశాలపై సదస్సు నిర్వహించారు. దేవాలయాల ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రి లోకేష్. తమ ప్రభుత్వం ప్రతి ఆలయంలో ధూపదీప నైవేద్యాలకు నిధులు పెంచిందన్నారు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుంచే తిరుమలలో అనేక మార్పులు వచ్చాయని.. భక్తులకు ఉచిత దర్శనం, అన్నదానంతోపాటు వసతి, విద్య, వైద్య సౌకర్యాలు ప్రారంభించారన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ నియంత్రణకు డ్రోన్లు ఉపయోగిస్తామన్నారు.
Also Read: Zelensky: ట్రంప్ చుట్టూ తప్పుడూ సమాచారమే..జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు!
Also Read: Champions Trophy: మొదటి మ్యాచ్ లోనే చిత్తు అయిన ఆతిథ్య జట్టు..