/rtv/media/media_files/2025/02/16/nfTOVCteCHKqA4bza21n.jpg)
fake currency
తూర్పు గోదావరి జిల్లా (East Godavari District) లో దొంగ నోట్ల చలామణి (Fake Currency) ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. ఈ సందర్భంగా రూ.1,06,58,000/- (ఒక కోటి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు) సీజ్ చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు.
Also Read: వామ్మో.. పెట్ డాగ్ ప్రియులు జాగ్రత్త సుమీ.. ఈ వీడియో చూస్తే వణుకు పుట్టాల్సిందే!
Fake Currency Scam
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిశోర్ వెల్లడించిన వివరాల ప్రకారం జిల్లాలో కొంతమంది నకిలీ నోట్లు తయారు చేస్తున్నారనే సమాచారం అందింది. దీంతో పోలీసు బృందాలు నిఘా పెట్టి దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నకిలీ కరెన్సీ ప్రింట్ చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుంచి కోటి 6 లక్షల 58 వేలు దొంగ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ కరెన్సీ ముద్రించడానికి వాడిన సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Also Read: ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి.. శవాలతో రెండ్రోజులు ఉన్న వృద్ధురాలు
అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు పోలీస్ స్టేషన్ పరిధిలో వ్యాన్ రిపేరు చేయించుకున్న ఒక వ్యక్తి మెకానిక్ కు దొంగనోట్లు ఇచ్చాడు. అనుమానంతో ఆనోట్లను పోలీసులకు అందజేయగా ఆరా తీస్తే ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠా నకిలీ నోట్లు ముద్రించి ఒక లక్ష అసలు నోట్లకు మూడు లక్షల నకిలీ నోట్లు ఇస్తున్నట్లు గుర్తించారు. గుంటూరు బాలాజీనగర్ లోని స్లమ్‌ను డెన్‌గా ఏర్పాటు చేసి నకిలీ నోట్లను తయారు చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. మధు అనే వ్యక్తి ఇంటర్‌నెట్‌లో చూసి దొంగ నోట్లు ఎలా చేయాలో ప్లాన్ చేశాడు. విజయవాడకు చెందిన మధుబాబు మరో వ్యక్తి మణికుమార్‌తో కలిసి నకిలీ నోట్లను ప్రింటింగ్ చేస్తున్నారు. కాగా అమాయక ప్రజలను మోసం చేస్తూ నకిలీ నోట్లను చెలామణి చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
Also Read: ఢిల్లీ రైల్వేస్టేషన్ తొక్కిసలాటకు కారణమిదే.. వెలుగులోకి సంచలన విషయాలు
Also Read : మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. 5జీ ఫోన్‌పై రూ.16వేల డిస్కౌంట్: డోంట్ మిస్ బ్రో!