/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/exams-jpg.webp)
exams
పదో తరగతి పరీక్షల్లో ఇన్విజిలేటర్ నిర్లక్ష్యం వల్ల ఆరుగురు విద్యార్థులకు ప్రశ్నాపత్రాలు తారుమారవడం కలకలం రేపిం ది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి డాన్‌బాస్కో స్కూల్ పరీక్షా కేంద్రంలో ఈ వ్యవహారం బయటపడింది. శనివారం నిర్వహించిన సంస్కృతం పరీక్షలో ముగ్గురు రెగ్యులర్ విద్యార్థులకు సప్లిమెంటరీ పేపర్‌ను, మరో ముగ్గురు సప్లిమెంటరీ విద్యార్థులకు రెగ్యులర్ ప్రశ్నాపత్రాన్ని ఇన్విజిలేటర్ ఇచ్చారు. ఈ విషయాన్ని విద్యార్థిని కరణం తేజస్వి ప్రశ్నాపత్రం అందుకున్న వెంటనే గుర్తించింది.
Also Read: YS Viveka Murder-SIT: వివేకా హత్య కేసులో రంగంలోకి దిగిన సిట్...వారి మరణాల పై విచారణ!
దీనిపై మరో విద్యార్థిని అడిగి నిర్ధారించుకుంటున్న సమయంలో మాట్లాడితే బయటకు పంపేస్తానని ఇన్విజిలేటర్ వారించడంతో మౌనంగా ఉండిపోయింది. పరీక్ష పూర్తయి బయటకు వచ్చిన తర్వాత తోటి విద్యార్థుల ప్రశ్నాపత్రంతో పోల్చి చూసుకొని ఈ ఆరుగురూ కంగుతిన్నారు. దీనిపై వారి తల్లిదండ్రులు కొద్దిసేపు పాఠశాల వద్ద ఆందోళన చేశారు. అధికారుల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు.
కాగా, ఇన్విజిలేటర్ పొరపాటు కారణంగా సంబంధం లేని పేపర్‌తో పరీక్ష రాసిన ఆరుగురు విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని డీఈవో యూవీ సుబ్బారావు పేర్కొన్నారు. ప్రశ్నాపత్రం మార్పు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇన్విజిలేటర్ శైలజను అధికారులు సస్పెండ్ చేయడంతో పాటు చీఫ్ సూపరింటెండెంట్ కేజేఎన్ లక్ష్మి, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్ జె. విద్యాసాగర్‌లకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెప్పుకొచ్చారు.
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కుప్పిలి మోడల్ స్కూలు పరీక్ష కేంద్రంలో టెన్త్ పరీక్షల కాపీయింగ్ వ్యవహారంలో ఆరుగురిపై కేసు నమోదైంది. శుక్రవారం ఇంగ్లిష్ పరీక్ష జరుగుతుండగా డీఈవో ఎస్.తిరుమల చైతన్య ఆధ్వర్యంలో నాలుగు బృందాలు ఆకస్మిక తనిఖీ నిర్వహించి 15మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ఆరుగురిపై కేసు నమోదు చేశామని ఎచ్చెర్ల ఎస్‌ఐ వి. సందీప్ కుమార్ తెలిపారు.
Also Read: YS Viveka Murder-SIT: వివేకా హత్య కేసులో రంగంలోకి దిగిన సిట్...వారి మరణాల పై విచారణ!
Also Read: BRS Working President KTR : నేడు కరీంనగర్ కు కేటీఆర్....ఎక్కడికక్కడ అరెస్ట్‌లు
ntr-district | ap | tenth-exams | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates