AP YCP: వైసీపీ యూటర్న్‌.. అమరావతికి జై కొడుతున్న జగన్.. బొత్స సంచలన వ్యాఖ్యలు!

మూడు రాజధానుల విషయంలో వైసీపీ యూ టర్న్‌ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని బొత్స సత్యనారాయణ ప్రకటించడం సంచలనం రేపుతోంది. పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని త్వరలోనే వెల్లడిస్తామన్నారు. 

New Update
Bosta: ఉద్యోగ సంఘాల జేఏసీ సమావేశంపై బొత్స ఎమన్నారంటే?

Botsa Satyanarayana sensational comments on Amaravati capital

AP YCP: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత వైసీపీ స్టాండ్‌ మారుతోందా. ముఖ్యంగా మూడు రాజధానుల విషయంలో పార్టీ యూ టర్న్‌ తీసుకుంటోందా? అమరావతిని ఏపీ రాజధానిగా వైసీపీ జై కొట్టనుందా అంటే తాజా పరిణామాలు చూస్తే అదే నిజమని తెలుస్తోంది. సోమవారం పార్టీ సీనియర్‌ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడిన మాటలు ఇందుకు ఊతంగా కనిపిస్తున్నాయి. మూడు రాజధానులే తమ ప్రభుత్వ విధానమని.. వీటిపైనే ఎన్నికలకు వెళ్తామంటూ గత ఎన్నికల ముందు గంభీరంగా చెప్పి మట్టికరిచిన వైసీపీ ఇప్పుడు ఆ విషయంలో పునరాలోచనలో పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితం కావడం, ప్రతిపాదిత మూడు రాజధానులకు ఏర్పాటు చేయాలనుకున్న ప్రాంతాల్లోనూ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించడంతో తన విధానాలపై పార్టీ వెనక్కి తగ్గుతున్నట్లుంది. మూడు రాజధానులే తమ పార్టీ విధానమని ఇప్పటివరకు గట్టిగా చెప్పిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు స్వరం మారుస్తున్నారు. 

అమరావతి శ్మశానంలా ఉంది..

రాజధానిపై తమ విధానాన్ని పునరాలోచించుకుంటామని బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అప్పట్లో ఉన్న పరిస్ధితులను బట్టి తాము మూడు రాజధానుల వైపు వెళ్లామని బొత్స అన్నారు. రాజధానిపై ఇప్పుడు తమ విధానం ఏమిటనేది చర్చించి చెబుతామని స్పష్టం చేశారు. ఈ అంశంపై పార్టీలో సమగ్రంగా చర్చించి తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామన్నారు. అమరావతి శ్మశానంలా ఉందంటూ గతంలో తాను వ్యాఖ్యానించడం నిజమేనని అంగీకరించిన బొత్స.. ఆరేళ్ల క్రితం అప్పటి సందర్భాన్ని బట్టి అలా మాట్లాడానన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో అధికారంలో ఉన్న గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో అతి కీలకమైనది మూడు రాజధానులు. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే.. విశాఖపట్నం కార్యనిర్వాహక, కర్నూలును న్యాయ రాజధానిగా బదలాయించాలని గతంలో భావించింది గానీ అది సాధ్యపడలేదు. వాస్తవ రూపాన్ని దాల్చలేదు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓటమిపాలు కావడానికి చంద్రబాబు అరెస్టుతో పాటు- మూడు రాజధానుల విధానం కూడా ఓ కారణమంటూ రాజకీయ విశ్లేషకులు విశ్లేషించారు. రాజధానులు చేయాలనుకున్న జిల్లాల్లో ఒక్క కర్నూలు మినహా మరెక్కడా కనీసం ఎమ్మెల్యే సీట్ల విషయంలో  ఖాతా కూడా తెరవలేకపోయింది వైసీపీ.  పార్టీ  సీనియర్లు సైతం ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈ ఓటమి నేపథ్యంలో మూడు రాజధానుల విధానాన్ని వైసీపీ పునఃసమీక్షించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.  

Also read : Hyderabad: చనిపోయిందా, చంపేశారా.. మిస్టరీగా మారిన శిరీష డెత్

అమరావతికి లక్ష కోట్ల ఖర్చు..

కాగా, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ అప్పట్లో నవ్యాంధ్రకు టీడీపీ ప్రభుత్వం నిర్ణయించిన అమరావతి రాజధానికి పూర్తిగా మద్దతు ప్రకటించింది. కానీ తర్వాత 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తర్వాత ఈ విషయంలో వైసీపీ మాటమార్చింది. అమరావతిపై లక్ష కోట్ల తమ ప్రభుత్వం ఖర్చుపెట్టలేదని, సంక్షేమ పథకాలకే తమ ప్రాధాన్యం అని స్పష్టం  చేసింది. అమరావతికి లక్ష కోట్ల ఖర్చు పెట్టడానికి బదులు విశాఖపట్నంలో పరిపాలన రాజధాని పెట్టి కొద్దిగా నిధులు ఖర్చు చేస్తే విశాఖ దానికదే అభివృద్ధి చెందుతుందని అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌ పలు సందర్భాల్లో చెప్పారు. అయితే అమరావతిలో అసెంబ్లీ ఉంచి శాసన రాజధానిగా కొనసాగిస్తామన్నారు. ఇదే నినాదంతో ఎన్నికలకు వెళ్లిన వైసీపీ ఇటు అమరావతి, అటు విశాఖ ప్రాంతాల్లో ఘోర ఓటమి చవి చూసింది. దీంతో ఆ పార్టీ రాజధాని విషయంలో రెండోసారి మాటమార్చాల్సిన పరిస్థితి ఏర్పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. తమ విధానాన్ని ప్రజలు తిరస్కరించడంతో వైసీపీ ఈ విషయంలో కచ్చితంగా అమరావతికి మద్దతిస్తూనే రాజధాని విషయంలో తమ సలహాలు, సూచనల పేరిట కొన్ని మార్పులు సూచించే అవకాశముందంటున్నారు.

Also Read :  టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైకుపైకి దూసుకెళ్లిన బొలెరో!

ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు.

New Update
ACCIDENT

AP Kakinada road accident one man died

Accident: ఏపీ కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తునిలో బొలెరో వాహనం ఎదురుగా బైకుపై వస్తున్న యువకుడిపైకి దూసుకెళ్లింది. దీంతో రెండు వాహనాల మధ్య ఇరుక్కుని యువకుడు దుర్మరణం చెందాడు. మృతుడు అనకాపల్లి నామవరం శివగా గుర్తించారు. ఈ మేరకు స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బొలెరో డ్రైవర్ మద్యం సేవించినట్లు అనుమానిస్తు్న్నారు. శివ అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకోగా మృతిడి పేరెంట్స్, బంధువులు శోకచంద్రంలో మునిగితేలారు. 

ప్రేమోన్మాది కత్తితో దాడి..

ఇదిలా ఉంటే.. విశాఖలో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, లేకపోతే చంపేస్తానంటూ కొద్ది రోజులుగా బెదిరిస్తున్నాడు. ఈ సంఘటన  విశాఖపట్నం జిల్లాలో బుధవారం కలకలం రేపింది. స్థానిక వివరాల ప్రకారం.. కొమ్మాది స్వయం కృషినగర్‌లో తల్లి, కుమార్తె  ఇద్దరు నివాసం ఉంటున్నారు. యువతిని ప్రేమించి పెళ్లి చేసుకోలేదని ఆమెపై కోపం పెంచుకున్నాడు. ఎలాగైనా హత్య చేయాలని పక్క ప్లాన్‌తో వారి ఇంటికి కత్తితో వచ్చి దాడి చేశాడు. ఈ దాడి తల్లి అక్కడికక్కడే మృతి చెందగా, కుమార్తెకు తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు.  

ఇది కూడా చదవండి: Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్!

ప్రమాదంపై సమాచారం అందుకున్న పీఎం పాలెం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాతాన్ని పరిశీలించారు. ఎలా జరిగిందని చుట్టు పక్కల వారిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తల్లి, కూతురిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయటంతో కాలనీ వాసులు భయబ్రాంతులకు లోనవుతున్నారు. పోలీసులు నింతుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Pastor Praveen: పాస్టర్ ప్రవీణ్ కేసులో పోలీసుల బిగ్ ట్విస్ట్.. ఒకరు అరెస్ట్!

 kakinada | died | telugu-news | today telugu news

Advertisment
Advertisment
Advertisment