/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/apsrtc-jpg.webp)
Aps RTC: ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బందికి.. డీజీపీ,ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రత్యేకంగా అభినందించారు. సంక్రాంతి సమయంలో మంచి ఎఫర్ట్ పెట్టిన ఆర్టీసీ అధికార యంత్రాంగాన్ని, ఉద్యోగులు, సిబ్బందిని అభినందిస్తున్నానని తెలిపారు. రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్, గ్యారేజీని ద్వారకా తిరుమల రావు సందర్శించిన సంక్రాంతికి అదనంగా ఆర్టీసీ బస్సులను పెద్దఎత్తున నడపడం ద్వారా గతేడాది రూ.20 కోట్ల ఆదాయం వచ్చిందని గుర్తు చేశారు.
Also Read: Attack on Dalits: దారుణం.. పనికి రానందుకు ముగ్గురు దళితులపై విచక్షణారహితంగా దాడి..
ఈ ఏడాది మరింత ఆదాయం పెరిగే అవకాశాలున్నాయన్నారు. సంక్రాంతి సమయంలో ప్రత్యేక చార్జీలు వసూలు చేయకుండానే ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం రావడం సంతోషంగా ఉందన్నారు. కమర్షియల్ ఆదాయమూ పెంచుకోవడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తున్నామని ఎండీ ద్వారకా తిరుమల రావు అన్నారు.
Also Read: ఇంట్లో వాళ్లతో ఫైట్ చేసి... ప్రియురాలితో పెళ్లి కోసం ముస్లిం నుంచి హిందూమతంలోకి
పెండింగ్ బకాయిల్ని...
ఆర్టీసీ సిబ్బందికి పెండింగ్ బకాయిల్ని (ఎరియర్స్)ను ఇప్పటికే కొంత చెల్లించామన్నారు. వారం రోజుల్లో మిగిలిన బకాయిల్లో 25 శాతం చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఆర్టీసీ సిబ్బందికి 2017 పీఆర్సీ బకాయిలు 50 శాతం చెల్లించామని ఆయన గుర్తు చేశారు. ఈ సంక్రాంతికి వచ్చిన ఆదాయాన్ని బట్టి వారం రోజుల్లో మరో 25 శాతం చెల్లించే అవకాశం ఉందన్నారు.
1,500 కొత్త బస్సులను...
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,500 కొత్త బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేశామని.. మరో వెయ్యికి పైగా ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయన్నారు. ఆర్టీసీ స్థలాల్లో షాపింగ్ మాల్స్ ఏర్పాటులో నిబంధనలను పాటిస్తామన్నారు.
Also Read: Donald Trump: అమెరికాకు స్వర్ణయుగం మొదలైంది..తొలి స్పీచ్ తో అదరగొట్టిన ట్రంప్!