/rtv/media/media_files/2025/03/07/whhKjMZ6Bg5KmE0JNljf.jpg)
summer tips
ఏపీప్రజలకు వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. ఏకంగా 43 డిగ్రీల ఎండ
ఏపీలో సూర్యుడి భగభగలు కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని.. ప్రధానంగా కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. పలు జిల్లాల్లో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంది.. ఉత్తరాంధ్రలోని పార్వతీపురం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్ జిల్లాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. మరోవైపు శుక్రవారం భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read: Canada prime Minister: కెనడా ప్రధానిగా మార్క్ ప్రమాణ స్వీకారం..
నంద్యాల జిల్లా గోస్పాడులో 42.8 డిగ్రీలు, కర్నూలు జిల్లా ఉలింద కొండలో 42.6 డిగ్రీలు, ప్రకాశం జిల్లా గొల్లవిడిపి, విజయనగరం జిల్లా పెదనదిపల్లిలో 41.7 డిగ్రీలు, కడప జిల్లా మద్దూరులో 41.5 డిగ్రీలు, అన్నమయ్య జిల్లా కంబాలకుంట 41.1 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా రావికమతం వడ్డాది, అనంతపురం జిల్లా నాగసముద్రంలో 41 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Also Read: Horoscope: నేడు ఈరాశి వారికి అన్నింటా విజయమే..!
గురువారం ప్రకాశం జిల్లా పెదదోర్నాలలో 42.4 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా నాతవరంలో 42.1 డిగ్రీలు,నంద్యాల జిల్లా రుద్రవరంలో 41.8 డిగ్రీలు, పల్నాడు జిల్లా అమరావతిలో 41.5 డిగ్రీలు, విజయనగరంలో 41.3 డిగ్రీలు, పార్వతీపురంమన్యం జిల్లా పాచిపెంటలో 41.9 డిగ్రీలు, కడప జిల్లా ఖాజీపేటలో 40.1 డిగ్రీలు, నెల్లూరు జిల్లా వరికుంటపాడులో 40 డిగ్రీలు, ఎన్టీఆర్ జిల్లా మోగులూరులో 40.6 డిగ్రీలు, చిత్తూరు జిల్లా గుడిపాలలో 40.3 డిగ్రీలు, తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగలో 40.2డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు ఎండ తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తెలంగాణలో కూడా సూర్యుడి ప్రతాపం కొనసాగుతోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉందని వాతావరణశాఖ చెబుతోంది. వచ్చే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
Also Read: Telangana: తెలంగాణ వాసులకు బిగ్ అలెర్ట్.. 5 రోజులు మండే ఎండలు...!
Also Read: Ranya Rao Case: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!