ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ సర్టిఫికేట్లు అన్నీ వాట్సాప్‌లోనే..

దేశంలో తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్‌ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వాట్సాప్ నంబర్‌ 919552300009ను మంత్రి లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ ధృవపత్రాలన్నీ కూడా వాట్సాప్ ద్వారా ప్రజలకు అందేలా ఈ సేవలను తీసుకొచ్చారు.

New Update
Breaking: లోకేష్ కు బిగ్ షాక్..ఏసీబీ కోర్టులో సీఐడీ పిటిషన్.!

whatsapp Governance started Nara Lokesh

పౌరసేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించింది. ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ ఈ వాట్సాప్ సేవలను ప్రారంభించారు. ఇకపై అన్ని ప్రభుత్వ ధృవపత్రాలన్నీ కూడా వాట్సాప్ ద్వారా ప్రజలకు అందేందుకు దీన్ని తీసుకొచ్చారు. దీని కోసం అధికారిక వాట్సాప్ నంబర్ 919552300009 ను కూడా మంత్రి లోకేష్ ప్రకటించారు. 

ఇది కూడా చూడండి: Siddipet Incident: తల్లీకూతుళ్ల ప్రాణం తీసిన కరువుపని.. సిద్దిపేటలో పెను విషాదం!

ఇది కూడా చూడండి: తస్సాదియ్యా మామూలోడు కాదయ్యా సిరాజ్ : ఆమెతో కాదు.. ఈమెతో డేటింగ్!

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా..

ఈ వాట్సాప్ గవర్నెన్స్ కింద మొదటి విడతలో 161 సేవలను అందించనున్నారు. ప్రజలు సర్టిఫికేట్ల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. దీనికి చెక్ పెట్టాలనే ఉద్దేశంతోనే ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాట్సాప్ ద్వారా పౌర సేవలు అన్ని అందించేందుకు 2024 అక్టోబరు 22న ప్రభుత్వం మెటాతో ఒప్పందం చేసుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకొచ్చింది. 

ఇది కూడా చూడండి: Maha Kumbh mela: వీవీఐపీల పాస్‌ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!

మొదటి విడతలో దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ, ఆర్టీసీ, రెవెన్యూ, అన్నా క్యాంటీన్, సీఎంఆర్‌ఎఫ్, మున్సిపల్ శాఖలో సేవలను అందిస్తారు. ఉదాహరణకు మీరు ప్రముఖ దేవాలయాల్లో దర్శనం కోసం టికెట్లు, గదుల బుకింగ్, డోనెషన్ల వంటి సేవలను అందిస్తుంది. అలాగే రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో సర్టిఫికేట్లు, జనన, మరణ ధృవీకరణ పత్రాలు, ఎలక్ట్రిసిటీ బిల్లులు అన్ని కూడా వాట్సాప్ ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. 

ఇది కూడా చూడండి:  USA: గడ్డకట్టే చలిలో నీళ్ళల్లో పడి బతకడం కష్టమే..ఇప్పటికి 18మంది మృతి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు