ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఆ సర్టిఫికేట్లు అన్నీ వాట్సాప్‌లోనే..
దేశంలో తొలిసారిగా వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికి సంబంధించిన వాట్సాప్ నంబర్ 919552300009ను మంత్రి లోకేష్ అధికారికంగా ప్రకటించారు. ప్రభుత్వ ధృవపత్రాలన్నీ కూడా వాట్సాప్ ద్వారా ప్రజలకు అందేలా ఈ సేవలను తీసుకొచ్చారు.