Ap Mega DSC: ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌...వారంలో మెగా డీఎస్సీ!

ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల కోసం డీఎస్సీ నోటిఫికేషన్‌ వారం రోజుల్లో విడుదల కానుంది.వర్గీకరణ ఆర్డినెన్స్‌ రాగానే కొత్త రోస్టర్‌ ప్రకారం పోస్టుల కేటాయింపు జరుగనుంది.ఒకట్రెండు రోజుల్లో ఫైలు రాజ్‌భవన్‌కు పంపుతారని సమాచారం.

New Update
AP : నేడు ఏపీ కొత్త టెట్‌ నోటిఫికేషన్‌.. దరఖాస్తులు ఎప్పటి నుంచి అంటే!

AP Govt

Ap Mega Dsc: వారం రోజుల్లో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ రెడీ అయ్యింది. ఎస్సీ వర్గీకరణ రోస్టర్‌ పాయింట్లు రాగానే నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. వర్గీకరణ ఆర్డినెన్స్‌ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతంచేసింది. ఒకట్రెండు రోజుల్లో ఫైలు రాజ్‌భవన్‌కు పంపుతారని, వెంటనే ఆర్డినెన్స్‌ జారీ అవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. 

Also Read: Hyderabad Rain: గంట వానకే హైదరాబాద్ ఆగమాగం.. కూలిన చెట్లు, చెరువులుగా రోడ్లు.. వీడియోలు వైరల్!

ఆర్డినెన్స్‌ జారీ కాగానే సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్లపై కొత్త రోస్టర్‌ విడుదల చేస్తుంది. దానికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయించి, డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు. రోస్టర్‌ పాయింట్లు విడుదలైన మరుసటి రోజు లేదా ఆ తర్వాత రోజు డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదలౌతుంది. ముందుగా ప్రకటించినట్లుగానే 16,347 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇస్తారు. కాగా, రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగులు డీఎస్సీ నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. 

Also Read: Kancha Gachibowli Lands : కంచ గచ్చిబౌలి భూములపై పోలీస్ శాఖ కీలక ఆదేశాలు.. ఎంట్రీకి పూర్తి నిషేధం!

గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వకపోవడంతో నిరుద్యోగుల సంఖ్య భారీగా పెరిగింది. కూటమి ప్రభుత్వం ఒకేసారి 16వేలకు పైగా పోస్టులు ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆశలు పెరిగాయి. వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తికావడంతో నోటిఫికేషన్‌ విడుదలకు మార్గం సుగమమైంది.

Also Read: Seetha Dayakar Reddy : తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ గా కొత్త కోట సీతా దయాకర్ రెడ్డి ...మరో ఆరుగురు కూడా...

Also Read: Palla Rajeshwar Reddy vs Kadiyam Srihari : బీఆర్ఎస్ ను నాశనం చేసిందే అతను....కడియం శ్రీహరి సంచలన కామెంట్స్‌

jobs | mega-dsc | AP Mega DSC Latest Updates | chandrababu about mega dsc | chandrababu on mega dsc | cm chandrababu on mega dsc | cm chandrababu shocking decision on mega dsc notification | latest-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Court Movie : తిరుపతిలో కోర్టు మూవీ లాగే....ఏం జరిగిందంటే...

ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. అజయ్ అనే యువకుడు 17 ఏళ్ల మైనర్ నిఖిత గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.

New Update
Court Movie

Court Movie

Court Movie: ఏపీలోని తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నరసింగాపురంలో అచ్చం కోర్టు సినిమా తరహ ఘటన సంచలనం రేకెత్తిస్తోంది. ఈ ఘటన తెలిసిన వారంతా ‘కోర్టు’ సినిమాను పోలి ఉందంటూ చర్చించుకుంటున్నారు. అసలు విషయానికొస్తే మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన అజయ్ అనే యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత ప్రేమించింది. గడచిన మూడేళ్లుగా వీరిద్ధరూ ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ వ్యవహారం నిఖిత కుటుంబ సభ్యులకు ఇష్టం లేకపోవడంతో గత ఏడాది ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. అయితే కులాలు వేరు కావడంతో పాటు నిఖిత మైనర్ కావడంతో అజయ్‌తో నిఖిత ప్రేమ కుటుంబ పరువును దెబ్బతీస్తుందని భావించిన ఆమె తల్లిదండ్రులు ఈ ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ తర్వాత తల్లిదండ్రలు ఆమెను ఇంటికి తీసుకొచ్చారు.నిఖిత మైనర్ కావడంతో, గత ఏడాది ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు అజయ్‌పై పోలీసులు ఫోక్సో (POCSO) కేసు నమోదు చేసి, అతడిని జైలుకు పంపారు. 

Also Read: ట్రంప్ టారిఫ్‌లు వేస్తే మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారు.. రాహుల్‌గాంధీ ఫైర్

ఈ క్రమంలోనే నిఖిత గర్భం దాల్చింది. దీంతో ఆమె తల్లి సుజాత కడుపులోని బిడ్డను చంపి, నిఖితను ఆసుపత్రిలో చేర్చినట్లు సమాచారం. ఆ తర్వాత నాలుగు నెలల పాటు జైల్లో ఉన్న అజయ్‌ను నిఖిత పలుమార్లు కలుస్తూ వచ్చింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో, నిఖిత తల్లిదండ్రులు సుజాత, కిషోర్ ఆమెను వేధింపులకు గురి చేస్తూ వచ్చారని అజయ్ చెప్తున్నాడు. శుక్రవారం నిఖిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో, కేవలం గంటల వ్యవధిలోనే ఆమె మృతదేహాన్ని తల్లిదండ్రులు దహనం చేశారు. “ఇద్దరం కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నాం. కానీ, ఇప్పుడు ఏదీ లేకుండా చేశారు,” అని అతడు కన్నీటితో వాపోయాడు. ప్రేమించిన 17 ఏళ్ల మైనర్ బాలిక నిఖిత మరణం పలు అనుమానాలకు తావిచ్చింది.  ఈ విషయం గ్రామస్తుల దృష్టికి రావడంతో, వారు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో నిఖిత తల్లిదండ్రులు సుజాత మరియు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: రేవ్ పార్టీలో అడ్డంగా బుక్కైన ఆర్మీ, రాజకీయ నేతల కూతుర్లు.. వీడియో వైరల్ 

అజయ్, నిఖిత మరణంపై తీవ్ర అనుమానాలు వ్యక్తం చేశాడు. “ఇంట్లో చంపాలని చూస్తున్నారని నాకు మెసేజ్‌లు పంపింది. ఆమె మృతిపై నాకు చాలా అనుమానాలు ఉన్నాయి,” అని అతడు చెప్పాడు. నిఖిత తల్లిదండ్రులు ఆమెను చాలాసార్లు కొట్టారని, పరువు కోసం ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చని అతడు ఆరోపించాడు. నిఖిత మృతదేహాన్ని వేగంగా దహనం చేయడం, ఆమె మరణానికి ముందు అజయ్‌కు పంపిన సందేశాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు ఈ కేసును లోతుగా విచారిస్తున్నారు. గ్రామస్తుల సమాచారం, అజయ్ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈ ఘటనలో పరువు హత్య అనుమానం బలంగా కనిపిస్తోంది. అయితే, ఖచ్చితమైన నిర్ధారణకు పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోనే కాక, రాష్ట్రవ్యాప్తంగా పరువు హత్యలపై మరోసారి చర్చకు దారితీసింది. ప్రేమ వివాహాలు, కులాంతర సంబంధాలను సమాజం ఇంకా ఎంతవరకు జీర్ణించుకోలేకపోతోందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నిఖిత మరణం వెనుక దాగిన నిజం ఏమిటనేది పోలీసు దర్యాప్తు తేల్చనుంది..

Also read: వాళ్లను తరిమికొట్టినట్లే.. బీజేపీ వాళ్లను ఓడించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
Advertisment
Advertisment