/rtv/media/media_files/2025/01/09/6FyAmO6GZdAAv729ueOp.jpg)
AP CM Chandrababu Naidu
AP News: కూటమి నేతలకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టం వచ్చినట్లు చేస్తే కుదరదని హెచ్చరించారు. సున్నితమైన అంశాలను రాజకీయం చేయడం సరికాదన్నారు. ప్రజలకు ఖచ్చితంగా మేలు చేసే పనులే చేయాలన్నారు.
ఆ విషయంలోనే కొంత సమస్య..
ఈ మేరకు గురువారం నీళ్లు, నిధులకు సంబంధించి ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన చంద్రబాబు.. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ప్రాజెక్టులు అమలు చేసానని చెప్పారు. బీమా దేవాదుల సహా అన్ని ప్రాజెక్టులకు తానే రూపకల్పన చేసినట్లు గుర్తు చేశారు. సముద్రంలోకి నిరుపయోగంగా పోయే నీళ్లను ఉపయోగించుకోవాలని ఇప్పుడు మేము ప్రయత్నిస్తున్నాం. తెలంగాణ ఆంధ్ర రెండు గోదావరి జలాలను ఉపయోగించుకోవాలి. కృష్ణా జలాల విషయంలోనే కొంత సమస్య ఉంది. రెండు రాష్ట్రాలకు కేటాయించిన నీటిలోనే ఏపీ తన వాటాను ఉపయోగించుకుంటున్నాం. సున్నిత అంశాల్లో రాజకీయాలు సరికాదు. రైతుల మేలు గురించి ఆలోచించాలన్నారు.
దేశ ఉత్పత్తిలో 50% ఏపీ నుంచి..
ఏపీలో మిరప ఎక్కువ పండిస్తారు. దేశ ఉత్పత్తిలో 50% ఏపీ నుంచి వస్తుంది. ఈ సంవత్సరం 12 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్ చేయాలి. ఇప్పటికే నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల పంట మార్కెట్ కు వచ్చింది. సుమారు రూ.5 లక్షల ఎకరాల్లో మిర్చి పంట వేస్తున్నారు. ఈ సంవత్సరం రైతు నష్టపోయే పరిస్థితి వచ్చింది. గత సంవత్సరం అంతర్జాతీయంగా మార్కెట్ బాగుండటంతో రైతులు పెద్దఎత్తున సాగు చేశారు. అనూహ్యంగా విదేశాల్లో డిమాండ్ తగ్గటంతో రైతు నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో రైతును ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని కేంద్ర మంత్రికి చెప్పాను. ఏ రకంగా ఆదుకోవాలని దానిపై సూచనలు చేసాం. రేపు సమావేశం జరిపి తిరిగి మనకు చెప్తా అన్నారని మంత్రులకు తెలిపారు.
ఇది కూడా చదవండి: TGPSC Update: గ్రూప్స్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆ రోజే ఫలితాలు విడుదల!
అలాగే రైతులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఎగుమతులు ప్రోత్సహించే దానిపైనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయన్నారు. రైతుల ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మూడు లేఖలు రాసినం. కేంద్రానికి ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నా. రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ రావు, కృష్ణదేవరాయలు కూడా ఫాలోఅప్ చేస్తున్నారని చెప్పారు. రేపు కేంద్రమంత్రి ఢిల్లీ వచ్చి అధికారులతో మాట్లాదాకా స్పష్టత వస్తుందన్నారు. రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యతంగా ప్రవర్తించాలేతప్పా రౌడీయిజం చేయటం సరికాదన్నారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే సరికాదని హెచ్చరించారు.