AP News: బిల్‌గేట్స్‌తో సీఎం చంద్రబాబు భేటీ.. కీలక ఒప్పందాలు!

మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా 40 నిమిషాలపాటు బిల్‌గేట్స్‌తో చర్చలు జరిపారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్‌లు ఎలా సహకరించుకోవాలనే దానిపై చర్చంచినట్లు సీఎం తెలిపారు.

New Update
cbn billgates

AP CM Chandrababu meets Microsoft founder Bill Gates

AP News: మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు దాదాపు 40 నిమిషాలపాటు బిల్‌గేట్స్‌తో చర్చలు జరిపారు. ఏపీ అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్‌లు ఎలా సహకరించుకోవాలనే దానిపై చర్చంచినట్లు చంద్రబాబు తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, విద్య, వ్యవసాయం ఉపాధి కల్పన వంటి కీలక రంగాలలో సేవలను మెరుగుపరచడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  ప్రిడిక్టివ్ అనలిటిక్స్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం గురించి చర్చలు జరిపామన్నారు.

స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడమే..

స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్‌ను సాకారం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. గేట్స్ ఫౌండేషన్‌ భాగస్వామ్యం మా ప్రజలను శక్తివంతం చేయడంలో స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషిస్తుందని మేము నమ్ముతున్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బిల్ గేట్స్ సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పలు ఒప్పందాలు చేసుకున్నట్లు సమాచారం. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు