/rtv/media/media_files/2025/03/18/UiNWBVINigaagJNQfgWt.jpg)
kcr jagan babu Photograph: (kcr jagan babu)
CM Chandrababu: ఒక రాజకీయ పార్టీ గెలుపు, ఓటములకు చాలా కారణాలు ఉంటాయి. పార్టీ అధినేతల సమర్థత, విధానాలు, వ్యూహాలు, ఆలోచనా ధోరణి వంటివన్నీ కూడా గెలుపోటములను నిర్ణయిస్తాయి. ఇందుకు ఏపీలో జగన్, తెలంగాణలో కేసీఆరే ఉదాహరణ. అయితే ఓటమిని ఒప్పుకోవడం, బాధ్యత తీసుకోవడం కూడా అధినేతలకు అవసరమే. ఈ క్రమంలోనే ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. జగన్, కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను చాలా చులకనగా చేసే వారనే ఆరోపణలు ఉన్నాయి. తమ మాటే శాసనంగా వ్యవహరించేవారని విమర్శలు కూడా వచ్చాయి. అయితే అభివృద్ధి విషయంలో కేసీఆర్ సమర్ధుడనిపించుకున్నా.. ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, వ్యూహాలు బెడిసికొట్టి.. ఓటమిని చవిచూశారు.
Also Read: రా కి రా.. సార్ కి సార్..! గ్రోక్ ఏఐ దెబ్బ అదుర్స్ కదూ!
అధినేతలే బలమూ, బలహీనత..
మరోవైపు జగన్ ఓటమికి అమరావతి, పోలవరం విషయాలు కీలక పాత్ర పోషించాయి. వీటి విషయంలో జగన్ తీసుకున్న అనుచిత నిర్ణయాలు, అభివృద్ధికి బదులు సంక్షేమ పథకాలను ఎంచుకోవడం వల్లనే వైసీపీ ఓడిపోయింది. 2019లో 151 సీట్లతో ప్రభంజనం చూసిన వైసీపీ.. 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. అయితే ఈ రెండు పార్టీలకు వాటి అధినేతలే బలమూ, బలహీనత. కానీ వారి తప్పొప్పులు ఆ పార్టీలపై తీవ్ర ప్రభావం చూపుతాయి.
Also Read: పూరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విజయ్ సేతుపతి..!
సర్దిచెప్పుకున్న కేసీఆర్, జగన్..
ఓ సినిమా సూపర్ హిట్ అయితే ఆ క్రెడిట్ హీరో సొంతం చేసుకుని, ఫ్లాప్ అయితే దర్శకుడిపైకి నెట్టేసినట్లే వారిద్దరూ కూడా తమ పార్టీల ఓటమిని ప్రత్యర్ధులకు ఆపాదించి తప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆచరణ సాధ్యం కాని హామీలను గుప్పించి, ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల్లో గెలిచిందని కేసీఆర్ వాదిస్తే, EVM లను ట్యాపరింగ్ చేశారని.. అందుకే తాము ఓడిపోయామని జగన్ సర్ధి చెప్పుకున్నారు. కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం 2004, 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమికి కారణం తానేనని.. దానికి తనదే పూర్తి బాధ్యత అని ఒప్పుకున్నారు.
Also Read: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి
ఇలా పార్టీ ఓటమిని అంగీకరించడం.. ఓటమి కారణాలు తెలుసుకొని ఆత్మవిమర్శలు చేసుకోవడం.. వాటిని సరిదిద్దుకోవడం, ఓటమికి పూర్తి బాధ్యత వహించడం చాలా హుందాగా ఉంటుంది. అప్పుడే ఆ పార్టీలు గెలిచినప్పుడు కూడా వారు ఆ గెలుపు క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవడానికి నైతిక అర్హత పొందుతారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు.. ఓటమికి బాధ్యత తీసుకున్నారు కాబట్టి కూటమి గెలుపు క్రెడిట్ కూడా ఆయనకే దక్కుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!