/rtv/media/media_files/2024/12/03/mOattlYizyad8Q9dKJf6.jpg)
AP Cabinet Meeting
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరి 6న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న ఈ కేబినెట్ భేటీలో 2025-26 బడ్జెట్ సమావేశాలపై చర్చించి ఒక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతోపాటు వివిధ అంశాలపైనా ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది.
Also Read: లోకేష్ బర్త్ డే గొడవ.. బ్యానర్లు చించి తన్నుకున్న తమ్ముళ్లు!
ఫిబ్రవరి 6న ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఏపీ కేబినెట్ భేటీ అవ్వనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేబినెట్ ఆమోదం కోసం ప్రతిపాదించిన వివిధ అంశాలను వచ్చే నెల 4వ తేదీ లోపు పంపించాలని అన్ని ప్రభుత్వ శాఖలకు ఏపీ సీఎస్ ఆదేశాలు జారీ చేశారు.
Also Read: క్లాస్ రూం నుంచి బయటికొచ్చి, మూడవ అంతస్తు నుంచి దూకి ఇంటర్ విద్యార్థి సూసైడ్
ఈ అంశాలపైనే చర్చ..
2025-2026 బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిర్వహించేందుకు బడ్జెట్ సమావేశాల నిర్వహణకు సంబంధించి ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకురావాలని ప్రయత్నిస్తున్న వాట్సాప్ గవర్నెన్స్ గైడ్‌లెన్స్ పై కేబినెట్ చర్చించి నిర్ణయం తీసుకోనుంది. త్వరలో రాష్ట్రంలో ప్రారంభించనున్న సంక్షేమ పథకాలపైనా కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.
Also Read : GHMC విస్తరణ .. ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు వీలినం!
Also Read : Maha kumbh mela: ఈసారి కప్ నమ్‌దే.. గంగాస్నానం చేసిన ఆర్సీబీ జెర్సీ